
భారత దేశ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ అరికట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు 21 రోజుల పాటు అంటే ఈ నెల 14వ తేదీ వరకు లాక్ డౌన్ పాటిస్తున్నసంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ లో భాగంగా సినిమా ఇండస్ట్రీలో కూడా అన్ని రకాల సినిమా షూటింగులు,ప్రీ ప్రొడక్షన్,పోస్ట్ ప్రొడక్షన్,రిలీజ్ మరియు ఇతర ప్రచార కార్యక్రమాలు అన్నీనిలిచిపోయాయి. ఈ పరిస్థితుల్లో ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉన్న రోజువారి కార్మికులపై కు భరోసా కలిగించడానికి సినిమా ఇండస్ట్రీలోని పెద్దలందరూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిన విరాళం కాకుండా సొంతగా మళ్లీ సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు. విరాళాలు కూడా ఇస్తున్నారు. ఇక హీరో డాక్టర్ రాజశేఖర్ గారు కూడా “రాజశేఖర్ చారిటబుల్ ట్రస్ట్” తరపున సినిమా ఇండస్ట్రీ లో ఉన్నటువంటి కార్మికులను ఆదుకుంటానని వారికి అవసరమైనటువంటి సహాయం చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇక రాజశేఖర్ గారి కుమార్తెలు శివాని మరియు శివాత్మిక రాజశేఖర్ లు ప్రస్తుతం చిరంజీవి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన కరోనా క్రైసిస్ చారిటీ సంస్థకు తమ వంతుగా ప్రతి ఒకరు 1 లక్ష రూపాయల విరాళాన్ని ప్రకటించారు.
చిన్న వయసులోనే గొప్పగా ఆలోచించి సినిమా కార్మికులను ఆదుకోవడానికి తమ వంతు సహాయం చేస్తున్నందుకు వీరికి పలు సినీ పెద్దలు ప్రశంసలు ఆశీస్సులు అందిస్తున్నారు. ఇక స్వతహాగా మెడిసిన్ చదువుతున్న డాక్టర్ రాజశేఖర్ గారు మరియు ఆయన కుటుంబ సభ్యులు “ప్రజలను ఇంటి వద్దనే ఉండమనీ, వ్యక్తిగత దూరం పాటించాలని.. బయట తిరగవద్దు.!” అని లాక్ డౌన్ నిబంధనలను పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Inspired by Nanna and Amma,@Rshivani_1 and I will be contributing rupees 1 lakh each from our earnings to the #coronacrisischarity
Proud to see our industry come together during this crisis!
Love you all
Take care?
We’ll make it through this??— Shivathmika Rajashekar (@ShivathmikaR) April 4, 2020