Homeటాప్ స్టోరీస్`జాతిర‌త్నాలు` మూవీ రివ్యూ

`జాతిర‌త్నాలు` మూవీ రివ్యూ

Jathi Ratnalu Movie Review Telugu
Jathi Ratnalu Movie Review Telugu

న‌టీన‌టులు: న‌వీన్ పొలిశెట్టి, ఫరియా అబ్దుల్లా, రాహుల్ రామ‌కృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి, ముర‌ళిశ‌ర్మ‌, బ్ర‌హ్మాజీ, వెన్నెల కిషోర్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, బ్ర‌హ్మానందం, న‌రేష్, శుభ‌లేఖ సుధాక‌ర్‌, గిరిబాబు త‌దిత‌రులు న‌టించారు.
ద‌ర్శ‌క‌త్వం:  కె.వి. అనుదీప్‌
నిర్మాత :  నాగ్ అశ్విన్‌
సంగీతం: ర‌ధ‌న్‌
కెమెరా : సిద్ధం మ‌నోహ‌ర్‌
ఎడిటింగ్‌: అభిన‌వ్ దండా
రిలీజ్ డేట్ : 11 – 03- 2021
రేటింగ్‌: 2.75/5

`ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ‌` చిత్రంతో హీరోగా న‌వ్వులు పూయించారు న‌వీన్ పొలిశెట్టి. డిటెక్టివ్‌ ఏజెంట్ పాత్ర‌లో ఆయ‌న పండించిన హాస్యం సినిమాకు ప్ల‌స్ కావ‌డ‌మే కాక‌కుండా ప్రేక్ష‌కుల్ని క‌డుపుబ్బా న‌వ్వించింది. ఇంత‌కు మించిన ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ని అందిస్తూ న‌వీన్ పొలిశెట్టి న‌టించిన చిత్రం `జాతిర‌త్నాలు`. ఆద్యంతం వినోదాత్మ‌కంగా రూపొందిన ఈ చిత్రంలో రాహుల్ రామ‌కృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి కూడా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. `మ‌హాన‌టి`తో జ‌జాతీయ స్థాయిలో ప్ర‌శంస‌లు అందుకున్న నాగ్ అశ్విన్ ఈ మూవీతో నిర్మాత‌గా మారారు. మ‌రి వీరికి ఈ మూవీ ఆశించిన ఫ‌లితాన్ని అందించిందా? .. న‌వీన్ పొలిశెట్టి ఈ సినిమాతో మ‌రో విజ‌యాన్ని ద‌క‌కించుకున్నారా? అన్న‌ది తెలియాలంటే క‌థ‌లోకి వెళ్లాల్సిందే.

- Advertisement -

క‌థ‌:
శ్రీ‌కాంత్ (న‌వీన్ పొలిశెట్టి), శేఖ‌ర్ (ప్రియ‌ద‌ర్శి), ర‌వి (రాహుల్ రామ‌కృష్ణ‌) ఈ ముగ్గురిది జోగీపేట‌. మంచి స్నేహితులు. అంతే కాదు అత్యంత తెలివిగ‌ల వాళ్ల‌మ‌ని భావించే తింగ‌రోళ్లు. ఏ ప‌నీ పాట లేకుండా జులాయిగా తిరుగుతూ ఎంజాయ్ చేస్తుంటారుఒక ఫైన్ డే ఇంట్లో వాళ్ల‌తో గొడ‌వ కావ‌డంతో ప్ర‌యోజ‌కులం అయి చూపిస్తామ‌ని ఛాలెంజ్ చేస్తారు. అక్క‌డి నుంచి హైద‌రాబాద్ వ‌స్తారు. ఇక్క‌డికి వ‌చ్చిన వాళ్లు స్థానిక ఎమ్మెల్యే చాణ‌క్య (ముర‌ళీశ‌ర్మ‌) పై జ‌రిగిన హ‌త్యాయ‌త్నం కేసులో ఇరుక్కుంటారు. చివ‌రికి జైలుకి వెళ‌తారు. అస‌లు వారిని ఈ కేసులో ఇరికించింది ఎవ‌రు? … లోక జ్ఞానం తెలియ‌ని ఈ ముగ్గురు స్నేహితులు జైలు నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డ్డారు? అన్న‌దే ఈ చిత్ర ప్ర‌ధాన క‌థ‌.

న‌టీన‌టుల న‌ట‌న‌:
ఆద్యంతం న‌వ్వులు పూయించే క‌థ కావ‌డంతో ఇందులో ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన న‌వీన్ పొలిశెట్టి, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ త‌మ పాత్ర‌ల్లో ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. న‌వీన్ పొలిశెట్టి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాలి. జోగీపేట శ్రీ‌కాంత్ పాత్ర‌లో అద్భుతంగా న‌టించాడు. తెర‌పై ఎక్క‌డా న‌వీన్ క‌నిపించ‌లేదు. జోగీపేట శ్రీకాంత్ మాత్ర‌మే కనిపించాడు. అంత‌గా ఆ పాత్ర‌ని ర‌క్తిక‌ట్టించాడు. క‌థ‌నంలో కొన్ని స‌న్నివేశాల్లో ప‌స లేకున్నా త‌న‌దైన టైమింగ్‌తో ఆక‌ట్టుకున్నాడు. ఇక ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఇలాంటి పాత్ర‌లు ల‌భించే ఏ రేంజ్‌లో రెచ్చి పోతారో చూపించారు. చిట్టి పాత్ర‌లో ఫరియా అబ్దుల్లా త‌న‌దైన పంధాలో ఆక‌ట్టుకుంది. జ‌స్టిస్ బ‌ల్వంత్ చౌద‌రి పాత్ర‌లో బ్ర‌హ్మానందం క‌నిపించిన ప్ర‌తీసారి న‌వ్వులు పూయించారు. ఇక మ‌గ‌తా పాత్ర‌ల్లో న‌టించిన ముర‌ళీశ‌ర్మ‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, గిరిబాబు, బ్ర‌హ్మాజీ, వెన్నెల కిషోర్ పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు.

సాంకేతిక వ‌ర్గం:
స్వ‌ప్న సినిమా అంటే సినిమా సాంకేతికంగా వున్న‌తంగానే వుంటుందన్న‌ది తెలిసిందే. ఈ సినిమా కూడా అదే స్థాయిలో వుంది. ఈ సినిమా విష‌యంలో ముందుగా చెప్పుకోవాల్సిన వ్య‌క్తి  ద‌ర్శ‌కుడు అనుదీప్‌. త‌ను రియ‌ల్ లైఫ్‌లో చాలా జోవియ‌ల్‌గా వుంటాడు. అదే త‌ర‌హా అమాయ‌క‌త్వం నిండిన పాత్ర‌ల్ని ఈ సినిమా కోసం రాసుకున్నాడు. ప్ర‌జెంట్ ట్రెండ్‌కి త‌గ్గ‌ట్టుగా సాగిన క‌థ కంటే క‌థ‌నం బాగుండేలా చూసుకుని ద‌ర్శ‌కుడిగా ఈ సారి పాసైపోయాడు. ర‌ధ‌న్ సంగీతం.. చిట్టి పాట ఆక‌ట్టుకుంటాయి. సిద్ధం మ‌నోహ‌ర్ సినిమాని చాలా రిచ్‌గా క‌నిపించేలా చిత్రీక‌రించారు. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

తీర్పు:
ముగ్గురు అమాయ‌కుల నేప‌థ్యంలో వాళ్ల తింగ‌రి వేశాలతో ఆద్యంతం న‌వ్వులు పూయించే చిత్ర‌మిది. ప్రేక్ష‌కుల్ని క‌డుపుబ్బా న‌వ్వించాల‌నే ఉద్దేశ్యంతో తెర‌కెక్కించిన ఈ చిత్రం ఆ విష‌యంలో నూటికి నూరు శాతం విజ‌యం సాధించింది. క‌థ కొత్త‌గా లేక‌పోయినా క‌థ‌ను న‌డిపించిన తీరు న‌వ్వులు పూయిస్తోంది. క‌డుపుబ్బా న‌వ్వాల‌నుకున్న వాళ్ల‌కు `జాతిర‌త్నాలు` బెస్ట్ ఛాయిస్.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All