Homeటాప్ స్టోరీస్సైరాలో జనసేనాని స్వరం

సైరాలో జనసేనాని స్వరం

Janasena's Pawan Kalyan accent in Saira
Janasena’s Pawan Kalyan accent in Saira

మెగాస్టార్ చిత్రంలో పవార్ స్టార్ స్వరం వినిపిస్తే … ఆ
స్వరం చిత్ర కథనంలోకి మనల్ని నడిపిస్తే… ఇక
అభిమాన గణం ఆనందానికి అవధులు ఏముంటాయి.. ఆ
స్థాయి అనందం త్వరలోనే అభిమానులకు అందబోతుంది.
మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహా రెడ్డి చిత్రానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ అందించారు.

బ్రిటీష్ పాలకులను ఎదురించి పోరాడిన సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితానికి వెండితెర రూపం ఈ చిత్రం. ఈ చారిత్రిక వీరుడి ఘనతను పరిచయం చేసే వాక్యాలు పవన్ కళ్యాణ్ గళం నుంచి వినబోతున్నాం.

- Advertisement -

ఈ చిత్రం టీజర్ మెగాస్టార్ పుట్టినరోజు కానుకగా రెండు రోజులు ముందుగానే ఆగస్ట్ 20న విడుదల చేయడం ఫ్యాన్స్ కి పెద్ద పండగనే చెప్పాలి. కొణిదెల ప్రొడక్షన్ పతాకంపై శ్రీమతి సురేఖ సమర్పణలో రాంచరణ్ ఈ చిత్రాన్ని అత్యధిక భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి హై టెక్నీకల్ వాల్యూస్తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. బాబాయ్ పవన్ కళ్యాణ్ తమ చిత్రానికి వాయిస్ ఓవర్ చెప్పడంతో కృతజ్ఞతలు తెలిపారు రాంచరణ్.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All