Homeటాప్ స్టోరీస్క‌రోనా ఎఫెక్ట్‌: `అవ‌తార్ 2` షూటింగ్ వాయిదా!

క‌రోనా ఎఫెక్ట్‌: `అవ‌తార్ 2` షూటింగ్ వాయిదా!

క‌రోనా ఎఫెక్ట్‌: `అవ‌తార్ 2` షూటింగ్ వాయిదా!
క‌రోనా ఎఫెక్ట్‌: `అవ‌తార్ 2` షూటింగ్ వాయిదా!

2009లో వ‌చ్చిన గ్రాఫిక‌ల్ వండ‌ర్ `అవ‌తార్‌`. జేమ్స్ కేమెరాన్ అద్భుత సృష్టిగా ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల్ని అబ్బుర‌ప‌రిచిన ఈ చిత్రం ఆన్ బీటెబుల్ రికార్డ్స్‌ని న‌మోదు చేసింది. ఈ చిత్రానికి సీక్వెల్స్‌ని రూపొందించే ప‌నిలో ద‌ర్శ‌కుడు జేమ్స్ కేమెరాన్ పార్ట్ 2, 3, 4 భాగాల‌ని నిర్మిస్తున్నారు. వ‌చ్చే ఏడాది డిసెంబ‌ర్ 17న రిలీజ్ చేయాల‌ని ద‌ర్శ‌కుడు ప్లాన్ చేశాడు.

అయితే జేమ్స్ కేమెరాన్ ప్లానింగ్‌ని క‌రోనా వైర‌స్ దెబ్బ‌తీసేలా క‌నిపిస్తోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి క‌రాళ నృత్యం చేస్తోంది. దేశాల‌న్నీ అస్థ‌వ్య‌స్తం అవుతున్నాయి. ఇప్ప‌టికే ల‌క్ష‌కు పైగా జ‌నాలు క‌రోనా వైర‌స్ బారిన ప‌డ్డారు. కొంత మంది ఇప్ప‌టికే చ‌నిపోయారు. దీంతో సినిమా షూటింగ్‌లు వ‌రుస‌గా నిలిపివేస్తున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌లే చిరు త‌న సినిమా షూటింగ్‌ని ఆపేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. `ఆర్ ఆర్ ఆర్` కూడా ఆగిపోయింది. తాజాగా ఈ లిస్ట్‌లోకి జేమ్స్ కేమెరాన్ ఫిల్మ్ `అవ‌తార్ 2` కూడా చేరింది.

- Advertisement -

జేమ్స్ కేమెరాన్ రూపొందిస్తున్న‌ `అవ‌తార్ 2` చిత్రీక‌ర‌ణ న్యూజిలాండ్‌లో జ‌రుగుతోంది. క‌రోనా వైర‌స్ ప్ర‌భ‌లుతుండ‌టంతో సినిమా షూటింగ్‌ని ఆపేస్తున్న‌ట్టు చిత్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన జాన్ లాండావు వెల్ల‌డించారు. అయితే విజువ‌ల్ ఎఫెక్ట్స్ మాత్రం య‌దాత‌దంగా జ‌రుగుతాయ‌ని స్ప‌ష్టం చేశారు. దీంతో ఈ సినిమా రిలీజ్ కూడా ముందు అనుకున్న డిసెంబ‌ర్‌లో కాకుండా జ‌న‌వ‌రిలో విడుద‌ల‌య్యే అవ‌కాశాలే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయ‌ని తెలిసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All