Homeటాప్ స్టోరీస్జంబలకిడి పంబ రివ్యూ

జంబలకిడి పంబ రివ్యూ

Jamba Lakidi Pamba Reviewజంబలకిడి పంబ రివ్యూ :
నటీనటులు : శ్రీనివాసరెడ్డి , సిద్ది ఇడ్నా ని , పోసాని
సంగీతం : గోపిసుందర్
నిర్మాతలు : రవి , జోజో జోష్ , శ్రీనివాసరెడ్డి
దర్శకత్వం : జేబీ మురళీకృష్ణ
రేటింగ్ : 2 / 5
రిలీజ్ డేట్ : 22 జూన్ 2018

 

కమెడియన్ శ్రీనివాసరెడ్డి హీరోగా నటించిన తాజా చిత్రం ” జంబలకిడి పంబ ” . పాతికేళ్ల క్రితం ఇదే టైటిల్ తో వచ్చిన జంబలకిడి పంబ సంచలన విజయం సాధించడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి అయితే ఆ అంచనాలను ఈ జంబలకిడి పంబ అందుకుందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే .

- Advertisement -

కథ :

వరుణ్ ( శ్రీనివాస రెడ్డి ) తన భార్య (సిద్ది ఇడ్నాని ) కి విడాకులు ఇవ్వాలనుకుంటాడు . తనని ప్రేమించి పెళ్లి చేసుకుంటే నిర్లక్ష్యం చేస్తున్నాడని భార్య కూడా వరుణ్ తో విడిపోవడానికి నిర్ణయించుకుంటుంది . దాంతో 98 విడాకులు ఇప్పించిన లాయర్ దగ్గరకు వెళ్తారు విడాకుల కోసం . అయితే గోవా ట్రిప్ కి వెళ్లిన లాయర్ అక్కడ యాక్సిడెంట్ లో చనిపోయి వరుణ్ దగ్గరకు వస్తాడు . 98 మందికి విడాకులు ఇప్పించడం వల్లే నాకు ఈ దుస్థితి పట్టిందని కాబట్టి మీరిద్దరూ విడాకులు తీసుకోకుండా కలిసి ఉండండని చెబుతాడు . కానీ వరుణ్ మాత్రం తన భార్య తో విడాకులు తీసుకోవాలనే అనుకుంటాడు దాంతో వాళ్ళ ఆత్మలు ఒకరి శరీరంలోకి ఒకరు వెళ్లేలా చేస్తాడు . దాంతో జంబలకిడి పంబ అవుతుంది . ఆ తర్వాత వాళ్ళ ఆత్మలు శరీరాలను వదిలి వెళ్లాయా ? విడాకుల ఆలోచన విరమించుకున్నారా ? తదితర విషయాలన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :

ఏమి లేవు

డ్రా బ్యాక్స్ :

లెక్కలేనన్ని

నటీనటుల ప్రతిభ :

శ్రీనివాసరెడ్డి తన పాత్ర పరిధి మేరకు బాగానే నటించాడు , అయితే సెకండాఫ్ లోనే కాస్త నటనకు అవకాశం ఉంది తప్ప మిగతా దంతా సోదే ! సిద్ది ఇడ్నాని చూడముచ్చటగా ఉంది , నటన కూడా బాగానే చేసింది . పోసాని , వెన్నెల కిషోర్ కాస్త నవ్వించారు కానీ ఆ కామెడీ అంతగా పేలలేదు . మిగతా పాత్రల్లో ఆయా నటీనటులు తమతమ పాత్రల పరిధి మేరకు నటించారు .

సాంకేతిక వర్గం :

మేకింగ్ బాగుంది , ఇక ఈ సినిమాకు ఆకర్షణ ఏదైనా ఉందంటే అది గోపి సుందర్ అందించిన సంగీతం . రెండు పాటలు బాగున్నాయి . సతీష్ ఛాయాగ్రహణం ఫరవాలేదు అయితే ఎడిటింగ్ మాత్రం చాలా చేయాలి , అనవసరపు సన్నివేశాలే ఎక్కువ కావడంతో ఎన్ని కట్ చేయాలో తెలీలేదనుకుంటా . ఇక దర్శకుడు విషయానికి వస్తే ……. సూపర్ హిట్ టైటిల్ ని పెట్టుకొని , వారు వీరు …. వీరు వారు అయితే ఎలా ఉంటుంది అన్న కాన్సెప్ట్ పెట్టుకొని మంచి సినిమా రాసుకోవాల్సింది పోయి పరమ చెత్త రాసుకున్నాడు . కనీసం ఒక్క టంటే ఒక్క సీన్ లో కూడా మెప్పించలేక పోయాడు .

ఓవరాల్ గా :

ఈ సినిమాకు వెళితే ….. కోరి కోరి తలనొప్పి , బిపి , షుగర్ లు కొని తెచ్చుకోవడమే

                    Click here for English Review

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All
కమెడియన్ శ్రీనివాసరెడ్డి హీరోగా నటించిన తాజా చిత్రం '' జంబలకిడి పంబ '' . పాతికేళ్ల క్రితం ఇదే టైటిల్ తో వచ్చిన జంబలకిడి పంబ సంచలన విజయం సాధించడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి అయితే ఆ అంచనాలను ఈ జంబలకిడి పంబ అందుకుందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే .జంబలకిడి పంబ రివ్యూ