Homeటాప్ స్టోరీస్నైటీ వేసుకొని నటించడానికి ఇబ్బంది పడ్డాడట

నైటీ వేసుకొని నటించడానికి ఇబ్బంది పడ్డాడట

comedian srinivas reddy about jambalakidi pambaఆడవాళ్ళ లాగా నటించడానికి నాకు పెద్దగా ఇబ్బంది ఎదురు కాలేదు కానీ నైటీ లు వేసుకొని , స్కర్ట్ లతో నటించడానికి మాత్రం చాలా చాలా ఇబ్బంది పడ్డానని అంటున్నాడు కమెడియన్ శ్రీనివాసరెడ్డి. తాజాగా శ్రీనివాస్ రెడ్డి హీరోగా నటించిన చిత్రం ” జంబలకిడి పంబ ” . ఈనెల 22న విడుదల అవుతున్న నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన శ్రీనివాస్ రెడ్డి జంబలకిడి పంబ చిత్ర విశేశాలను వెల్లడించాడు .

నరేష్ – ఇవివి సత్యనారాయణ ల కాంబినేషన్ లో వచ్చిన జంబలకిడి పంబ కు మా సినిమాకు ఎక్కడా పోలిక ఉండదు ఒక్క టైటిల్ విషయంలో అలాగే వారు వీరు అయ్యే సన్నివేశాల్లో కూడా కేవలం హీరో – హీరోయిన్ ల ఆత్మలు మారతాయి కానీ మిగతావాళ్ళు కాదని , ఈ సినిమా నాని , శర్వానంద్ లు చేయాల్సిన సినిమా అయినప్పటికీ నాకోసం కథలో స్వల్ప మార్పులు చేసారని తెలిపాడు శ్రీనివాసరెడ్డి .

- Advertisement -

జంబలకిడి పంబ చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు మా చిత్ర బృందాన్ని అభినందించారని , రేపు సినిమా రిలీజ్ అయ్యాక ప్రేక్షకుల మెప్పు కూడా పొందుతామని …… నా సినిమాలో కథే హీరో అని నేను కాదని అంటున్నాడు శ్రీనివాసరెడ్డి . వినోదమే ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రం లో హీరోయిన్ సిద్ది ఇడ్నాని కి చాలామంచి పేరు వస్తుందని,…… లేడీ గెటప్ వేసుకోవడం కొంత ఇబ్బంది అయినప్పటికీ నటనపై ఇష్టంతోనే చేసానని అంటున్నాడు శ్రీనివాసరెడ్డి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All