Homeటాప్ స్టోరీస్ఆర్ ఆర్ ఆర్: జక్కన్న నష్ట నివారణ చర్యలు మొదలుపెట్టాడు

ఆర్ ఆర్ ఆర్: జక్కన్న నష్ట నివారణ చర్యలు మొదలుపెట్టాడు

Jakkanna serious about RRR leaks
Jakkanna serious about RRR leaks

సాంకేతికత పెరిగిపోయిన ఈ రోజుల్లో సినిమా షూటింగ్ అప్పుడు లీకులు ఆపడం ఎవరికైనా కష్టసాధ్యమే. ఫిల్మ్ మేకర్స్ ఎన్ని చర్యలు తీసుకున్నా కానీ ఎక్కడో ఒక చోట నుండి ఈ లీకులు సినిమా యూనిట్ ను ఇబ్బంది పెడుతుంటాయి. ఇది ఏ ఒక్క హీరోకు, ఏ ఒక్క దర్శకుడికో పరిమితమైనది కాదు. ప్రతీ ఒక్కరూ ఎదుర్కొంటున్న ఇబ్బందే. కాకపొతే కొంత మందికి సినిమాలకు సినిమాలే లీకవుతాయి. కొంత మండివి వీడియో క్లిప్స్ లీకవుతాయి. కొన్ని సినిమాలకు వర్కింగ్ స్టిల్స్ లీకవుతాయి. ఇవి సినిమాలకు ఎంతో కొంత డ్యామేజీ అయితే చేస్తాయి. అందుకే ఈ రకమైన పైరసీని అరికట్టడానికి, ముఖ్యంగా అవుట్ డోర్ షూట్స్ ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఒక టీమ్ ఇందుకోసమే పనిచేస్తూ ఉంటుంది.

రీసెంట్ ఈ లీకుల బారిన పడ్డాడు జక్కన్న. రాజమౌళి ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ లను లీడ్స్ లో పెట్టి తెరకెక్కిస్తోన్న ఫిక్షనల్ పీరియాడిక్ డ్రామా ఆర్ ఆర్ ఆర్. ఇప్పటికే 75 శాతానికి పైగా షూటింగ్ ఈ చిత్రం పూర్తి చేసుకుంది. ప్రస్తుతం విశాఖ జిల్లా మన్యం ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా ఎన్టీఆర్ పాల్గొంటున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటివరకూ చాలా రహస్యంగా మైంటైన్ చేసాడు జక్కన్న. షూటింగ్ ఎంత పూర్తయినా కానీ ఎన్టీఆర్ లుక్ కానీ రామ్ చరణ్ లుక్ కానీ బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. అయితే ఈసారి మన్యం ప్రాంతంలో షూటింగ్ చేస్తున్నప్పుడు మాత్రం ఎవరో ఆకతాయి ఎన్టీఆర్ లుక్ ను వీడియో తీసి పెట్టాడు. దీంతో ఇప్పుడు ఎన్టీఆర్ కొమరం భీమ్ గా ఎలా ఉంటాడు అనేది ఒక క్లారిటీ వచేసినట్లైంది.

- Advertisement -

ఈ లీక్ తో ఆర్ ఆర్ ఆర్ టీమ్ కు గట్టి షాక్ తగిలిందని చెప్పాలి. ఎన్టీఆర్ లుక్ లీకవడంతో నష్ట నివారణ చర్యలు చేపట్టింది. షూటింగ్ స్పాట్ లోకి ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకురావడాన్ని నిషేధించింది. ప్రత్యేకంగా ఒక టీమ్ ను నియమించి ఔటర్స్ ఎవరైనా షూటింగ్ స్పాట్ లో లేకుండా చూడాలని స్ట్రిక్ట్ ఆజ్ఞలు జారీ చేసింది. మరి ఈ చర్యలతోనైనా లీకులు ఆగుతాయేమో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All