Homeగాసిప్స్ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ డేట్ మారిపోయినట్టేనా?

ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ డేట్ మారిపోయినట్టేనా?

RRR release not on july 30th
RRR release not on july 30th

2020లో రానున్న అత్యంత ఆసక్తికర చిత్రాల్లో ప్రముఖమైనది కచ్చితంగా ఆర్ ఆర్ ఆర్. ఇండస్ట్రీ మొత్తం, ఆ మాటకొస్తే దేశం మొత్తం ఈ సినిమా కోసం ఎదురుచూస్తోంది. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం దీనికి ప్రధాన కారణం. దీంతోపాటు తెలుగు రాష్ట్రాల వరకూ రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి టాప్ స్టార్స్ ఈ చిత్రంలో కలిసి నటిస్తున్నారు. వీటికి తోడు ఇది ఒక పీరియాడిక్ ఫిక్షనల్ డ్రామా. మాములుగా ఫిక్షనల్ డ్రామాలు ఇస్తేనే రాజమౌళి వాటిని ఏ రేంజ్ లో పండిస్తాడో చూసాం. అలాంటిది  డిఫాల్ట్ గా హీరోయిజం ఉండే పోరాట యోధుల జీవితాల ఆధారంగా తీసిన సినిమా అంటే ఇక దాని గురించి స్పెషల్ గా చెప్పేదేముంది. అందుకే ఆర్ ఆర్ ఆర్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ 70 శాతం దాకా పూర్తయిందని వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే. దీంతో సినిమా విడుదల వాయిదా పడిందనే వార్తల్లో నిజం లేదనే అనుకున్నారందరూ. ఇంకా 30 శాతం షూటింగ్ మాత్రమే ఉంది. సినిమా రిలీజ్ మొదట జులై 30 అన్నారు కాబట్టి ఇంకా ఎనిమిది నెలల సమయం పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్ అన్నిటికీ భేషుగ్గా సరిపోతుందని అందరూ భావించారు.

అయితే ఈరోజు ఆర్ ఆర్ ఆర్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్ ను, ఈ చిత్రంలోని విలన్స్ ను ప్రకటించారు. ఆ విషయాలను తెలియజేస్తూ ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేసారు. దాంట్లో అందరినీ ఆకర్షించినవి రెండు ఉన్నాయి. మొదటిది ఈ చిత్రాన్ని పది భాషల్లో విడుదల చేస్తున్నారు. బాహుబలితో వచ్చిన క్రేజ్ ను రాజమౌళి అండ్ కో పూర్తిగా వాడుకుంటున్నారన్నమాట. పైగా ఇది ఇద్దరు స్వాతంత్ర సమరయోధుల కథ. కచ్చితంగా అందరికీ కనెక్ట్ ఉంటుంది. అందుకే పది భాషల్లో విడుదల చేయాలనుకుంటున్నారు. అయితే వాటిలో విదేశీ భాషలు ఉంటాయా లేవా అన్నది ఇంకా క్లారిటీ లేదు.

- Advertisement -

ఇక రెండో విషయం.. ఆర్ ఆర్ ఆర్ 2020లో విడుదలవుతుంది అని చెప్పారు. ఇందులో ఆసక్తికరం ఏముందా అనుకుంటున్నారా.. మొన్నటిదాకా జులై 30, 2020న రిలీజ్ అన్నవాళ్ళు ఇప్పుడు జులై 30 అన్నది ఎగరగొట్టేసారు. పది భాషల్లో సినిమా రిలీజ్ కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ కు సమయం పడుతుంది, పైగా అన్ని చోట్లా ప్రమోషన్స్ అదరగొట్టాలి. అందుకే ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ విషయంలో ఇచ్చిన కమిట్మెంట్ ను ఇప్పుడు వెనక్కి తీసుకున్నారు. షూటింగ్ మొత్తం మార్చ్, ఏప్రిల్ మాసాల్లో అవగొట్టేసి అక్కడి నుండి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కు బాగా సమయమిచ్చి ఏ దసరాకో సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు.

ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. అలియా భట్, సముద్రఖని, అజయ్ దేవగన్ కీలక పాత్రలు పోషిస్తున్న విషయం తెల్సిందే. దానయ్య డివివి ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా బ్రిటిష్ స్టేజ్ నటి ఒలీవియా మోరిస్ ను కథానాయికగా ఎంపిక చేసిన విషయం తెల్సిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All