Homeటాప్ స్టోరీస్పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల లొల్లి మళ్ళీ షురూ

పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల లొల్లి మళ్ళీ షురూ

Jagan again critisized pawan kalyan personal lifeపవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల లొల్లి మళ్ళీ షురూ అయ్యింది . ప్రతిపక్ష నేత జగన్ మరోసారి పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల పై కామెంట్ చేసి సంచలనం సృష్టించాడు . ఇంతకుముందే పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల పై కామెంట్ చేసిన జగన్ తాజాగా మరోసారి కార్ల ని మార్చినట్లుగా పెళ్లాలను మార్చుతున్నాడని పవన్ కళ్యాణ్ పై నిప్పులు చెరిగాడు జగన్ . పెళ్లాలను మార్చితే మగాడివా ? ఇదేనా నీ మగతనం అంటూ ఆగ్రహం వ్యక్తం చేసాడు జగన్ .

రాజకీయ నాయకులు ఆరోపణలు చేసుకోవచ్చు కానీ వ్యక్తిగత జీవితాలను రోడ్డు మీదకు లాగొద్దని హితువు పలుకుతున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు . జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తక్కువేమీ తినలేదు జగన్ వ్యక్తిగత జీవితం పై కూడా విమర్శలు చేసాడు . దాంతో జగన్ పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల మీద కామెంట్ చేస్తూనే ఉన్నాడు . మూడు పెళ్లిళ్లు కాదని నాలుగో పెళ్లి కూడా చేసుకున్నాడని ఇంతకుముందు పవన్ పై జగన్ ఆరోపించిన విషయం తెలిసిందే . ఇప్పుడే ఇలా ఉంటే ఎన్నికల నాటికి ఎంత దారుణంగా విమర్శించు కుంటారో అన్న చర్చ మొదలైంది .

- Advertisement -

English Title: Jagan again critisized pawan kalyan personal life

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All