Homeటాప్ స్టోరీస్కాజల్ స్థానంలో జాక్వెలిన్ ను తీసుకున్నారా?

కాజల్ స్థానంలో జాక్వెలిన్ ను తీసుకున్నారా?

కాజల్ స్థానంలో జాక్వెలిన్ ను తీసుకున్నారా?
కాజల్ స్థానంలో జాక్వెలిన్ ను తీసుకున్నారా?

గతేడాది టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన బాయ్ ఫ్రెండ్ గౌతమ్ కిచ్లును వివాహమాడిన విషయం తెల్సిందే. గత కొన్ని రోజులుగా కాజల్ అగర్వాల్ గర్భవతి అని, ఈ కపుల్ తమ తొలి బిడ్డకు త్వరలోనే స్వాగతం పలుకుతున్నారని వార్తలు వచ్చాయి. వివాహం జరిగిన తర్వాత కొన్ని నెలలు బ్రేక్ తీసుకున్న కాజల్ మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది.

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో చేస్తోన్న ఆచార్య చిత్రంలో హీరోయిన్ గా చేసింది కాజల్. ఈ సినిమా షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసింది కాజల్. అయితే ఇప్పుడు ప్రెగ్నంట్ కావడంతో సినిమాల నుండి బ్రేక్ తీసుకుంది. ఆచార్య తర్వాత అక్కినేని నాగార్జున దర్శకత్వంలో ది ఘోస్ట్ చిత్రాన్ని కూడా ఓకే చేసింది.

- Advertisement -

ఇప్పుడు ది ఘోస్ట్ నుండి కాజల్ తప్పుకుందనే సమాచారముంది. ఇప్పటికే కొన్ని సీన్లు ఆమెపై చిత్రీకరించినా కూడా కాజల్ తన పర్సనల్ లైఫ్ కే ప్రిఫరెన్స్ ఇవ్వాలని నిర్ణయించుకుంది. దీంతో ఆమె స్థానంలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ను తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All