Homeన్యూస్ఇష్టంగా రివ్యూ

ఇష్టంగా రివ్యూ

istamga movie review
ఇష్టంగా రివ్యూ

ఇష్టంగా రివ్యూ :
నటీనటులు : అర్జున్ మహి ,తనిష్క్ రాజన్
సంగీతం : ఎలేందర్ మహావీర్
నిర్మాత : వెంకటేశ్వర్ రావు
దర్శకత్వం : సంపత్ వి రుద్ర
రేటింగ్ : 3/5
రిలీజ్ డేట్ : 28 డిసెంబర్ 2018

 

- Advertisement -

కథ :

కొరియోగ్రాఫర్ అయిన కృష్ణ ( అర్జున్ మహి ) కి పెళ్లి మీద నమ్మకం ఉండదు . అయితే చాలామంది అమ్మాయిలతో మాత్రం రొమాన్స్ చేస్తూ బ్రేకప్ చెబుతుంటాడు . కంటెంట్ రైటర్ అయిన సత్య ( తనిష్క్ రాజన్ ) కృష్ణ ని ప్రేమిస్తుంది , ఆ సమయంలో శారీరకంగా దగ్గరౌతారు . అయితే పెళ్లి కోసం ఫోర్స్ చేస్తుంది సత్య కానీ పెళ్లి మీద నమ్మకం లేని కృష్ణ దానికి ఒప్పుకోడు ,పెళ్లి మీద నమ్మకం లేని కృష్ణ మారాడా ? సత్యని అంగీకరించాడా ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

 

హైలెట్స్ :

అర్జున్ మహి
తనిష్క్ రాజన్ గ్లామర్

 

డ్రా బ్యాక్స్ :

ఎంటర్ టైన్ మెంట్
స్క్రీన్ ప్లే
ఎడిటింగ్

 

నటీనటుల ప్రతిభ :

కొరియోగ్రాఫర్ కృష్ణ పాత్రలో బాగా మెప్పించాడు అర్జున్ మహి . రొమాంటిక్ సీన్స్ లో లవ్ సీన్స్ లో బాగా నటించాడు . కథ ఎక్కువగా కృష్ణ పాత్ర చుట్టూ తిరుగుతుంది దాంతో ఆ అవకాశాన్ని బాగానే వినియోగించుకున్నాడు అర్జున్ మహి . నటనలోనే కాదు స్టైలిష్ లుక్స్ తో కూడా ఆకట్టుకున్నాడు . తనిష్క్ రాజన్ గ్లామర్ తో అలరించింది . అర్జున్ మహి – తనిష్క్ రాజన్ ల మధ్య వచ్చే రొమాంటిక్స్ సీన్స్ యువత ని అలరించేలా ఉన్నాయి .

 

సాంకేతిక వర్గం :

వెంకటేశ్వర్ రావు ఖర్చుకు వెనుకాడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు , అలాగే నిర్మాత పెట్టిన ఖర్చుని తెరమీద కనిపించేలా రిచ్ లుక్ తీసుకొచ్చారు ఛాయాగ్రాహకులు . పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి , అద్నాన్ పాడిన పాట ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచింది . దర్శకుడు ప్రేమకథ ని రాసుకున్నాడు , బాగానే తెరకెక్కించారు .

 

ఓవరాల్ గా :

ప్రేమికులకు ……. ఇష్టంగా

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All