Homeటాప్ స్టోరీస్సాహో స్టోరీ ఇదే అంటున్నారే?

సాహో స్టోరీ ఇదే అంటున్నారే?

Saaho Story Leaks..?
Saaho Story Leaks..?

రెబెల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత చేస్తున్న సాహోపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. ఇప్పటికే బుక్ మై షో వంటి టికెట్ బుకింగ్ యాప్స్ లో టికెట్లు పెట్టిన నిమిషాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. తెలుగులోనే కాక ఈ సినిమాపై హిందీలో కూడా ఆకాశాన్నంటే రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఆగష్టు 30న సినిమా విడుదల ఉన్నా కానీ గురువారం అర్ధరాత్రి నుండే స్పెషల్ షోలకు పర్మిషన్ లభించడంతో సందడి మొదలవుతుంది.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదనంగా రెండు వారాల పాటు రోజూ రెండు షోలు వేసుకోవచ్చని జీవో జారీ చేసింది. ఈ నేపథ్యంలో సాహో తొలిరోజు వసూళ్లు ఎంతో అంచనా వేయడం కూడా కష్టమే. ఇదిలా ఉండగా సాహోకు సంబంధించిన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ అంచనాలు మరింత పెంచేస్తున్నాయి. పేరుకి ఇందులో ప్రభాస్ అశోక్ చక్రవర్తి అనే కాప్ గా పనిచేస్తున్నా, జెంటిల్ మ్యాన్, కిక్ తరహాలో మంచి దొంగగా, దొంగతనాలు చేస్తాడట. దీనికి కారణం కూడా చాలా కన్విన్సింగ్ గా పెట్టినట్లు తెలుస్తోంది.

- Advertisement -

ప్రభాస్ సంగతి తెలిసి హీరోయిన్ మొదట్లో అపార్ధం చేసుకున్నా తర్వాత సపోర్ట్ చేస్తుందట. మొత్తానికి ప్రభాస్, శ్రద్ధా అనుకోకుండా విలన్ల వలయంలో చిక్కుకుని ఎలా బయటపడ్డారు, దేశానికి హాని చేస్తున్న విలన్ల పని ఎలా పట్టారన్నది కథాంశం. ఇది నిజమో కాదో తెలీదు కానీ ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య మాత్రం ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All