Homeటాప్ స్టోరీస్ఆ సినిమా హాలీవుడ్ సినిమాకు కాపీనా

ఆ సినిమా హాలీవుడ్ సినిమాకు కాపీనా

sumanth idam jagath movie copy from nightcrawlerఅక్కినేని నాగేశ్వర్ రావు మనవడిగా తెరంగేట్రం చేసిన సుమంత్ కి హీరోగా అంతగా కలిసిరాలేదు ! ఎన్ని ప్రయోగాలు చేసినా , ఎన్ని చిత్రాల్లో నటించినా అందులో కొన్ని హిట్ అయినప్పటికీ సుమంత్ కు కెరీర్ పరంగా ఉపయోగపడిన సినిమా ఏది లేదు అలాగే కెరీర్ కూడా అంత సవ్యంగా సాగడం లేదు కాకపోతే వేడి నీళ్లకు చన్నీళ్ళు తోడైనట్లుగా అడపా దడపా సినిమాలు మాత్రం చేస్తూనే ఉన్నాడు . అయితే తాజాగా ఈ హీరో చేస్తున్న ” ఇదం జగత్ ” హాలీవుడ్ చిత్రం ” నైట్ క్రాలర్ ” చిత్రానికి కాపీ అని వినబడుతోంది అలాగే టీజర్ ని చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది కూడా .

2014 లో విడుదలైన నైట్ క్రాలర్ మంచి విజయం సాధించింది . రాత్రి వేళలో జరిగే అక్రమాలను షూట్ చేస్తూ వాటిని లోకల్ ఛానల్ కు అమ్ముకొని సొమ్ము చేసుకునే హీరో కథ , కాగా తాజాగా విడుదలైన టీజర్ లో కూడా అదే తాలూకు షేడ్ కనిపిస్తుండటంతో నైట్ క్రాలర్ చిత్రాన్ని ఫ్రీ మేక్ చేస్తున్నారా ? లేక కొన్ని అంశాలను మాత్రమే తీసుకొని చేస్తున్నారా చూడాలి . అయితే టీజర్ తో మాత్రం ఫ్రీ మేక్ చిత్రమని ముద్ర పడుతోంది . దానికి తగ్గట్లుగా టైటిల్ కూడా ” ఇదం జగత్ ” అని ఉండటంతో ఈ అనుమానాలు ఎక్కువయ్యాయి . ఇది ఫ్రీ మేకా ? లేదా ? అన్నది తెలియాలంటే సినిమా విడుదల అయ్యేంత వరకు ఎదురు చూడాల్సిందే . అలాగే ఇది సుమంత్ కు హిట్ నిస్తుందా ? ఇచ్చినా దాన్ని క్యాష్ చేసుకునే వెసులుబాటు సుమంత్ కు ఉందా ? అన్నది కూడా తేలాలి .

- Advertisement -

English Title: is sumanth idam jagath movie copy from nightcrawler

YouTube video
YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All