Homeటాప్ స్టోరీస్అక్కినేని బయోపిక్ చేయరట

అక్కినేని బయోపిక్ చేయరట

nagarjuna not intrested on akkineni biopicమహానటుడు అక్కినేని నాగేశ్వర్ రావు బయోపిక్ చేయబోవడం లేదని స్పష్టం చేసాడు కింగ్ నాగార్జున . బయోపిక్ అంటే ట్రాజెడీ ఎండింగ్ ఉండాలని కానీ నాన్నగారి ది సంపూర్ణ జీవితమని చివరి రోజుల్లో సైతం సంతోషంగా గడిపాడని అందుకే బయోపిక్ చేయాలనే ఆలోచన లేదని , అయితే ఆయన జీవితాన్ని పుస్తక రూపంలో తీసుకురావాలనే ఆలోచన మాత్రం ఉందని అంటున్నాడు నాగార్జున .

నిరుపేద కుటుంబం నుండి వచ్చిన అక్కినేని నాగేశ్వర్ రావు నిజంగానే నిండు జీవితాన్ని అనుభవించాడు అయితే నిరుపేద కుటుంబమే కాకుండా చదువు లేని వ్యక్తి అక్కినేని ఆ తర్వాత దృఢ సంకల్పంతో అత్యున్నత విద్యాభ్యాసాన్ని అందుకున్నాడు . ఆ కోణంలో ఏమైనా సినిమా చేయొచ్చేమో …… కానీ నాగార్జున మాత్రం ఆ అవసరం లేదని అంటున్నాడు . నిర్మాతగా , హీరోగా , స్టూడియో అధినేతగా తిరుగులేని విజయాలను అందుకున్నాడు అక్కినేని అలాగే కుటుంబ పరంగా కూడా ఉన్నతమైన జీవితాన్ని అనుభవించాడు కాబట్టి నాగార్జున ఆలోచన ప్రకారం అక్కినేని బయోపిక్ అవసరం లేదట !

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All