Homeటాప్ స్టోరీస్ఐరా సినిమాస్ ప్రొడ‌క్ష‌న్ నం.1 మూవీ ప్రారంభం!

ఐరా సినిమాస్ ప్రొడ‌క్ష‌న్ నం.1 మూవీ ప్రారంభం!

ఐరా సినిమాస్ ప్రొడ‌క్ష‌న్ నం.1 మూవీ ప్రారంభం!
ఐరా సినిమాస్ ప్రొడ‌క్ష‌న్ నం.1 మూవీ ప్రారంభం!

నాగ‌శౌర్య హీరోగా ఛ‌లో, అశ్వ‌థ్థామ వంటి సూప‌ర్ హిట్ సినిమాల్ని నిర్మించిన ఐరా క్రియేష‌న్స్ సంస్థ నుంచి సోద‌ర సంస్థ‌గా ఐరా సినిమాస్ ప్రారంభ‌మైంది. ఔత్సాహిక న‌టీన‌టులు, ద‌ర్శ‌కులతో కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాల‌ని నిర్మించాల‌ని ఐరా సినిమాస్ ప్ర‌ధాన ఉద్దేశం. చిత్ర‌సీమ‌లోకి అడుగుపెట్టాల‌ని క‌ల‌లుక‌నే నూత‌న న‌టులు, ద‌ర్శ‌కుల‌కు ఇది మంచి అవ‌కాశం.

హైద‌రాబాద్‌లోని సంస్థ కార్యాల‌యంలో ఐరా సినిమాస్ నిర్మిస్తోన్న తొలి చిత్ర ప్రారంభోత్స‌వం జ‌రిగింది. స‌న్నీ కోమాలపాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ చిత్రానికి న‌టుడు, వ్యాపార వేత్త‌, ఏఎస్‌పీ మీడియా హౌస్ అధినేత అభిన‌వ్ స‌ర్ధార్ స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. న‌వంబ‌ర్ 9 నుంచి ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌న‌గ‌పుంది.
 
ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత ఉషా శంక‌ర్ ప్ర‌సాద్ ముల్పూరి మాట్లాడుతూ “ ఈ రోజు మంచి రోజు కావ‌డంతో పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాం. ఐరా సినిమా అనేది ఐరా క్రియేష‌న్స్‌కు సోద‌ర సంస్థ‌. యంగ్ టాలెంట్‌ని ప్రోత్స‌హించే ఉద్దేశ్యంతో ఈ బ్యాన‌ర్‌ని ప్రారంభిస్తున్నాం. ఫ్రెష్ కంటెంట్‌తో బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ ను ఈ బ్యాన‌ర్‌పై నిర్మిస్తాం. స‌న్నీ కొమ్మాల‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో మేము నిర్మిస్తున్న తొలి చిత్రం ఓ థ్రిల్ల‌ర్ `అని తెలిపారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All