
యంగ్ హీరో నాగశౌర్య వరుస సినిమాలతో స్పీడు పెంచేశాడు. లేడీ డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్నాడు. సంతోష్ జాగర్లపూడి తో మరో చిత్రం చేస్తున్న నాగశౌర్య సొంత నిర్మాణ సంస్థ ఐరా క్రియేషన్స్‌లో లో తాజాగా మరో చిత్రాన్ని పట్టాలెక్కించాడు. ఉష ముల్పూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి `లవర్` ఫస్త్రమ్ అనీష్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఐరా క్రియేషన్స్ ప్రొడక్షన్ నంబర్ 4గా రూపొందుతున్న ఈ మూవీ ఈ బుధవారం ఉదయం గ్రాండ్‌గా లాంచ్ అయింది. హీరో నాగశౌర్యపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి స్టార్ డైరెక్టర్ కొరటాల శివ క్లాప్ నిచ్చారు. హీరో నారా రోహిత్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. మరో స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. స్క్రిప్ట్‌ని యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ దర్శకుడు అనీష్ కృష్ణకు అందించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ మాజీ రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ మూవీకి మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు.
అలా ఎలా?, లవర్ చిత్రాల ఫేమ్ అనీష్ కృష్ణ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా ఐరా క్రియేషన్స్ ప్రొడక్షన్ నం. 4ని ఈ రోజు ప్రారంభించడం ఆనందంగా వుంది. కోవిడ్ టైమ్‌లో కూడా మామీద వున్న అభిమానంతో మేము పిలవగానే వచ్చిన స్టార్ డైరెక్టర్ కొరటాల శివగారికి, అనిల్ రావిపూడి గారికి, నారా రోహిత్ గారికి, నాగవంశీగారికి ధన్యవాదాలు` అన్నారు నిర్మాత ఉష ముల్పూరి.
రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరపైకి రానున్న ఈ మూవీకి సాయి శ్రీరామ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. సమర్పణ శంకర్ ప్రసాద్ ముల్పూరి. సహ నిర్మాత బుజ్జి, డిజిటల్ హెడ్ ఎం.ఎస్. ఎన్. గౌతమ్. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నుంచి ప్రారంభం కానుంది. మిగతా వివరాల్ని త్వరలోనే వెల్లడిస్తాం` అని చిత్ర బృందం తెలిపింది.