
హ్యాట్రిక్ ప్లాపుల తర్వాత అఖిల్ అక్కినేని నాలుగో చిత్రం ఎట్టకేలకు మొదలైంది. చాలా నెలలు వివిధ స్క్రిప్ట్ లు విన్న అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. ఈ సినిమా ఇటీవలే సెట్స్ పైకి వెళ్లగా, హీరోయిన్ వేట కోసం ఎక్కువ కాలం ఎదురుచూడాల్సి వచ్చింది. అయితే ఎట్టకేలకు పూజ హెగ్డేను హీరోయిన్ గా సెలెక్ట్ చేసారు.
పదిరోజుల క్రితం పూజా హెగ్దే కూడా సినిమా షూటింగ్ లో పాల్గొంటోంది. తాజా సమాచారం ప్రకారం పూజ, అఖిల్ మరియు ఇతర నటీనటులు పాల్గొంటుండగా కోర్ట్ రూమ్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. అయితే ఇది రొమాంటిక్ డ్రామా కావడంతో కోర్ట్ రూమ్ సీన్స్ ఏంటా అని పలువురు ఆశ్చర్యపోతున్నారు.
- Advertisement -
గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
- Advertisement -