Homeటాప్ స్టోరీస్గద్దలకొండ గణేష్ ( వాల్మీకి ) రివ్యూ

గద్దలకొండ గణేష్ ( వాల్మీకి ) రివ్యూ

Gaddalakonda Ganesh ( Valmiki ) Movie Review in Telugu
Gaddalakonda Ganesh ( Valmiki ) Movie Review in Telugu

గద్దలకొండ గణేష్ ( వాల్మీకి ) రివ్యూ:
నటీనటులు:
వరుణ్ తేజ్,పూజా హెగ్దే,అతర్వా,మిర్నాలిని రవి
దర్శకత్వం: హరీష్ శంకర్
నిర్మాణం: 14 రీల్స్ ప్లస్
సంగీతం: మిక్కీ జే మేయర్
విడుదల తేదీ : 20 సెప్టెంబర్ 2019
రేటింగ్ : 3/5

విభిన్న చిత్రాలను ఎంచుకుంటూ తెలుగు ఇండస్ట్రీలో దూసుకుపోతున్న వరుణ్ తేజ్ మరో సినిమాతో మన ముందుకు వచ్చాడు. ముందు వాల్మీకిగా ప్రచారం జరిగి, తర్వాత గద్దలకొండ గణేష్ గా మారిన చిత్రం ఈరోజు విడుదలైంది. ఒక స్పేస్ థ్రిల్లర్, ఒక రొమాంటిక్ కామెడీ చేసిన తర్వాత వరుణ్ పూర్తి స్థాయి మాస్ క్యారెక్టర్ ను ఈ సినిమాలో చూపించాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం జనాలను ఎంతవరకూ మెప్పించిందో చూద్దాం.

- Advertisement -

కథ :
అభి (అథర్వ) దర్శకుడు కావాలని కలలు కంటుంటాడు. దర్శకుడు అవ్వాలంటే ఒక గ్యాంగ్ స్టర్ కథ కావాలని నిర్మాత కోరడంతో నిజ జీవితంలో గ్యాంగ్ స్టర్ అయిన గడ్డలకొండ గణేష్ (వరుణ్ తేజ్)ను దగ్గరుండి పరిశీలించి తన కథే రాయాలనుకుంటాడు. ఈ ప్రాసెస్ లో అభి ఎదుర్కొన్న సవాళ్లేంటి? తను అనుకున్నట్లు కథ రాయగలిగాడా? గద్దలకొండ గణేష్ అలియాస్ గని ఎందుకు గ్యాంగ్ స్టర్ గా మారాడు? ఈ విషయాలన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథనం :
టాలీవుడ్ లో వరుణ్ తేజ్ ప్రయాణం చూడముచ్చటగా ఉంది. ఒక సినిమాకి మరొక సినిమాకి సంబంధం లేకుండా తను ఎంచుకుంటున్న సినిమాలు తననొక వెర్సటైల్ నటుడిగా నిలబెడతాయనడంలో సందేహం లేదు. వాల్మీకి చిత్ర ఒరిజినల్ వెర్షన్ జిగర్తాండలో బాబీ సింహా వరుణ్ తేజ్ చేసిన పాత్ర చేసాడు. అక్కడ అతను చెలరేగిపోయాడు. జాతీయ స్థాయి అవార్డు కూడా వచ్చింది. మరి అలాంటి పాత్రను వరుణ్ తేజ్ ఎన్నుకోవడమే సాహసం. అయితే వరుణ్ ఆ పాత్రకు తన గెటప్ ను మార్చుకున్న తీరుకే హ్యాట్సాఫ్ చెప్పొచ్చు. చూడగానే ఒక విలన్ ని చూస్తున్నామన్న భావన తీసుకురాగలిగాడు.

ఇక సినిమా విషయానికి వస్తే.. హరీష్ శంకర్ ప్రధాన బలం ఎంటర్టైన్మెంట్. ఆ విషయంలో ఈ సినిమా నిరాశపరచదు. సినిమా మొదలైన కాసేపటికే మనల్ని ఎంగేజ్ చేస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా చాలా రేసీగా సాగిపోతుంది. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ బ్లాక్ లు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయి. సెకండ్ హాఫ్ పై మరిన్ని అంచనాలు ఏర్పడేలా చేస్తాయి.

అయితే సెకండ్ హాఫ్ లో వాల్మీకి తడబడుతుంది. సెకండ్ హాఫ్ మొదలవ్వడం బాగున్నా తర్వాత బాగా డల్ అయిపోయింది. హరీష్ శంకర్ ఒరిజినల్ లో లేని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను ఇందులో యాడ్ చేసాడు. ఈ ఎపిసోడ్ బాలేదు అనిపించదు, అలాగని సూపర్ అని కూడా అనిపించదు. అలా వెళ్ళిపోతుంది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఎల్లువొచ్చి గోదారమ్మ పాట మాస్ ప్రేక్షకుల చేత విజిల్స్ వేయిస్తుంది. అయితే ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వల్ల గద్దలకొండ పాత్ర సోల్ దెబ్బతింది. ఆ పాత్రను హీరోలా చూపించడం వల్ల పాత్ర ఔచిత్యం దెబ్బతింది. ఆ ఎఫెక్ట్ ప్రీ క్లయిమాక్స్, క్లయిమాక్స్ పై పడింది.

నటీనటులు :
ముందే చెప్పుకున్నట్లు వరుణ్ తేజ్ కి ఇది కెరీర్ లో బెస్ట్ రోల్ అని చెప్పవచ్చు. తన ఆహార్యం, డైలాగ్ డెలివరీ ఇలా అన్నిట్లో వైవిధ్యం చూపించి ఆకట్టుకున్నాడు. ఈ సినిమాకి మెయిన్ అట్రాక్షన్ వరుణే. తమిళ నటుడు అధర్వ బాగానే చేసాడు. ఒరిజినల్ తో పోలిస్తే ఇందులో తన పాత్రను కొంచెం తగ్గించేశారు. డబ్బింగ్ అధర్వకి సూట్ అవ్వలేదేమో అనిపిస్తుంది. పూజ హెగ్డే ఉన్నంతలో అలరించింది. మృణాళిని ఆకట్టుకుంటుంది. బ్రహ్మాజీ మరోసారి తన కామెడీ టైమింగ్ తో దుమ్మురేపాడు. సత్య ఓకే. తనికెళ్ళ భరణి పాత్ర బాగుంది.

సాంకేతిక వర్గం :
వాల్మీకి చిత్రంలో ముందుగా మాట్లాడుకోవాల్సింది మ్యూజిక్ గురించే. ఇప్పటిదాకా తన కెరీర్ లో క్లాస్ ఆల్బమ్స్ అందించిన మిక్కీ తొలిసారి మాస్ సినిమాకి పనిచేసాడు. పాటలు పర్వాలేదు అనిపించినా, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా “వాకా వాకా” అని వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాను మరో లెవెల్ కు తీసుకెళ్లింది. సినిమాటోగ్రఫీ అదిరిపోతుంది. ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్ గా ఉండొచ్చు. సెకండ్ హాఫ్ లో ఫ్లో దెబ్బతింది. డైలాగ్స్ సినిమాకు ప్రధాన బలం.

చివరిగా :
వాల్మీకి వరుణ్ తేజ్ కెరీర్ కు ప్లస్ అయ్యే సినిమానే. హరీష్ శంకర్ సెకండ్ హాఫ్ విషయంలో మరింత కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పెట్టకపోయి ఉంటేనే బాగుండేదేమో అనిపిస్తుంది. అయినా అది బాగోలేదని కాదు, సినిమాకు అవసరం లేదు. మొత్తానికి వాల్మీకి ఒకసారి హ్యాపీగా చూడదగ్గ చిత్రం. మాస్ చిత్రం కాబట్టి ఈ సినిమా కలెక్షన్ రేంజ్ ను ఇప్పుడే చెప్పలేం. హిట్ అయ్యే ఛాన్సెస్ అధికంగా ఉన్నాయి.

వాల్మీకి – వరుణ్ తేజ్ వన్ మ్యాన్ షో. 

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All