Homeగాసిప్స్సౌత్‌లో గోవా బేబీ కెరీర్ ముగిసిన‌ట్టేనా?

సౌత్‌లో గోవా బేబీ కెరీర్ ముగిసిన‌ట్టేనా?

సౌత్‌లో గోవా బేబీ కెరీర్ ముగిసిన‌ట్టేనా?
సౌత్‌లో గోవా బేబీ కెరీర్ ముగిసిన‌ట్టేనా?

సౌత్ సినిమాల‌తో పాపుల‌ర్ అయింది గోవా బ్యూటీ ఇలియానా. ఎన‌ర్జిటిక్ హీరో రామ్‌ని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ వైవీఎస్ చౌద‌రి `దేవ‌దాస్‌` చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా ద్వారా ద‌క్షిణాదికి ప‌రిచ‌యమ‌య్యారు ఇలియానా. రెండ‌వ సినిమా `పోకిరి`తో ఇండ‌స్ట్రీ హిట్‌ని ద‌క్కించుకున్నారు. వ‌రుస విజ‌యాలు ద‌క్క‌డంతో టాలీవుడ్ నిర్మాత‌లంతా ఇలియానా ల‌క్కీ హీరోయిన్ అని వ‌రుస ఆఫ‌ర్లు ఇవ్వ‌డం మొద‌లుపెట్టారు. దీంతో ఇలియానా పారితోషికాన్ని భారీగా పెంచేసింది. దాదాపు కోటి వ‌ర‌కు వ‌సూలు చేసిన‌ట్టు అప్ప‌ట్లో చెప్పుకున్నారు.

అయితే ఆ క్రేజ్ ఎంతో కాలం నిల‌వ‌లేదు. 2006 నుంచి 2010 వ‌ర‌కు తెలుగు సినిమాల్లో త‌న హ‌వాని చూపించిన ఇలియానా సౌత్ సినిమాల్లో క్రేజీ క‌థానాయిక‌గా స్టార్‌డ‌మ్‌ని సొంతం చేసుకుంది. ఆమె క్రేజ్ తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఇలాగే కొన‌సాగుతుంద‌ని అంతా భావించారు కానీ అనూహ్యంగా ఇలియానాకు ఓ స్టార్ హీరోకు మ‌ధ్య ఈగో క్లాషెస్ రావ‌డంతో సీన్ మారిపోయింది. దాంతో ఇలియానా 2012లో `బ‌ర్ఫీ` చిత్రంతో బాలీవుడ్ బాట‌ప‌ట్టింది. తెలుగులో స్టార్ హీరోల‌తో క‌లిసి న‌టించిన ఆమెకు బాలీవుడ్‌లో మాత్రం ఆ స్థాయి అవ‌కాశాలు రాలేదు. తెలుగులో ఎన్టీఆర్‌తో క‌లిసి న‌టించిన `శ‌క్తి` చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో ఎన్టీఆర్‌కు ఇలియానాకు మ‌ధ్య అభిప్రాయ బేధాలు ఏర్ప‌డ్డాయ‌ని, ఆ కార‌ణంగానే ఇలియానా సౌత్‌కు గుడ్‌బై చెప్పేసింద‌ని చెబుతారు.

- Advertisement -

కొంత విరామం త‌రువాత‌ మాస్ మ‌హారాజా ర‌వితేజ `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని` సినిమాతో మ‌ళ్లీ తెలుగు తెర‌పై ఇలియానాను బిజీ చేయాల‌ని ప్ర‌య‌త్నించాడు కానీ ఫ‌లితం లేకుండా పోయింది. దీంతో ఇక సౌత్ చిత్రాల్లో న‌టించ‌కూడ‌ద‌ని ఇలియానా నిర్ణ‌యించుకుంద‌ట‌. బాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే ఆమె కెరీర్ గాడిన ప‌డుతోంది. తాజాగా ఇలియానా న‌టించిన కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ `పాగ‌ల్‌పంతి` ఇటీవ‌లే రిలీజై మంచి వ‌సూళ్ల‌ని రాబ‌డుతోంది. ఈ సినిమా త‌రువాత ఇలియానా `ద బిగ్ బుల్‌` పేరుతో అజ‌య్ దేవ‌గ‌న్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం నిర్మాణ ద‌శ‌లో వుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All