
స్టార్ నప్రొడ్యూసర్ దిల్ రాజుకు గత కొన్ని రోజుల కిందట కరోనా పోకినట్టు వార్తలు వినిపించాయి. ఆ తరువాత నుంచి ఆయన క్వారెంటైన్‌కే పరిమితమయ్యారు. డాక్టర్ల సలహాలు పాటిస్తూ చికిత్స తీసుకున్నారు. తాజాగా కోలుకున్న ఆయన శనివారం `వకీల్ సాబ్` ప్రమోషన్స్ కోసం బయటికొచ్చారు. ప్రత్యేకంగా ప్రెస్ మీట్‌ని నిర్వహించారు. దర్శకుడు శ్రీరామ్ వేణుతో కలిసి తన కార్యాలయంలో పాత్రికేయులతో ముచ్చటించారు.
ఈ సందర్భఃగా పలుఉ ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు. `వకీల్ సాబ్` సాధించిన విజయం తనకు అత్యంత సంతృప్తినిచ్చిందని, కల్యాణ్ అభిమానులు తీవ్ర భావోద్వేగానికి లోనవుతూ కన్నీళ్లు ఈ సినిమాని చూస్తున్నారని ఈ సందర్భంగా దిల్ రాజు అన్నారు. దేశంలోని అన్ని చోట్ల ఎన్నికలు ముగుస్తున్న నేపథ్యంలో కేంద్ర తిరిగి 50 శాతం ఆక్యుపెన్సీని విధించే అవకాశం వుందన్నారు.
ఈ సందర్భంగా అల్లు అర్జున్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో చేయనున్న `ఐకాన్` గురించి స్పష్టం చేశారు. ఈ మూవీ స్క్రిప్ట్ ఎప్పుడో పూర్తయిందని, అది తన మనసుకు హత్తుకుందని, రెండు రకాల కారణాల వల్ల ఈ మూవీ ఆలస్యం అవుతూ వచ్చిందని, అయితే త్వరలోనే ఈ మూవీని పట్టాలెక్కించబోతున్నామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తమ నెక్స్ట్ ప్రాజెక్ట్ `ఐకాన్` అని క్లారిటీ ఇచ్చారు.