Homeటాప్ స్టోరీస్చిన్మయిని తాకరాని చోట చేతులు వేసి .......

చిన్మయిని తాకరాని చోట చేతులు వేసి …….

చిన్మయిని తాకరాని చోట చేతులు వేసి .......
చిన్మయిని తాకరాని చోట చేతులు వేసి …….

సింగర్ గా , సమంత కు డబ్బింగ్ చెప్పే ఆర్టిస్ట్ గా చిన్మయి కి ఏనలేని గుర్తింపు ఉంది , అయితే అలాంటి చిన్మయి శ్రీపాదని తాకరాని చోట చేతులు వేసి శునకానందం పొందారట ! అయితే అది ఇప్పుడు కాదు సుమా ! చిన్మయికి 8 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అలాగే పదేళ్ళ వయసు ఉన్నప్పుడు . సమాజంలో పలువురు చీడపురుగులు ఉన్నారని , పెద్ద మనుషుల ముసుగులో వెధవ వేషాలు వేస్తుంటారని నేను కూడా లైంగిక వేధింపులను ఎదుర్కొన్నానని అది కూడా చిన్న వయసులోనే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది చిన్మయి . గతకొంతకాలంగా లైంగిక వేధింపుల గురించి పలువురు మహిళలు , హీరోయిన్ లు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్న విషయం తెలిసిందే . అందులో భాగంగా తనకు జరిగిన అవమానాలను కూడా చెబుతోంది చిన్మయి .

మహిళలకు రక్షణ లేకుండా పోయిందని , చిన్న వయసులోనే వాళ్ళు లైంగిక వేధింపులకు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తోంది చిన్మయి . సినిమారంగంలో కూడా పలువురు పెద్ద మనుషుల్లా వ్యవహరిస్తుంటారని కానీ వాళ్ళు మేకవన్నె పులుల లాంటి వారని సంచలన వ్యాఖ్యలు చేసింది . అయితే వాళ్ళు ఎవరు ? అన్నది మాత్రం వివరాలను వెల్లడించలేదు చిన్మయి . నటుడు రాహుల్ రవీంద్రన్ ని ప్రేమించి పెళ్ళి చేసుకున్న చిన్మయి ఇప్పుడు మాత్రం ఎవడైనా వెధవ వేషాలు వేస్తే చెప్పుతో సమాధానం చెబుతానంటోంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All