Homeటాప్ స్టోరీస్సమంత వేసుకున్న డ్రెస్ పై నెటిజన్ల ఫైర్

సమంత వేసుకున్న డ్రెస్ పై నెటిజన్ల ఫైర్

actress Samantha trolled for wearing short dressపెళ్లి చేసుకొని అక్కినేని ఇంటి కోడలు అయిన సమంత ఇలా పొట్టి పొట్టి బట్టలు వేసుకోవడం ఏంటి ? అస్సలు బాగోలేదు , ఇలాంటి పొట్టి డ్రెస్ లు వేసుకోకు నీకు సూట్ కావు అంటూ కొంతమంది నెటిజన్లు సమంత పై విమర్శలు ఎక్కుపెట్టారు . తాజాగా ఈ భామ భర్తతో కలిసి తెగ ఎంజాయ్ చేస్తోంది . యు టర్న్ , శైలజారెడ్డి అల్లుడు చిత్రాలు వరుసగా విజయాలు అందుకోవడంతో చాలా సంతోషంగా ఉన్నారు . విశేషం ఏంటంటే ఈ రెండు చిత్రాలు కూడా ఒకేరోజున విడుదల కావడంతో మరింత సంతోషంగా ఉంది సమంత . దాంతో పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నారు .

అందులో భాగంగానే ఎరుపు రంగు చిట్టి పొట్టి గౌన్ వేసుకుంది అందులో రకరకాల భంగిమల్లో ఫోటోలు దిగింది . అయితే ఫోటోలు దిగితే ఫరవాలేదు కానీ వాటిని తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది ఇంకేముంది నెటిజన్లు సమంత కు సలహాలు ఇవ్వడం మొదలు పెట్టారు అలాగే కొంతమంది ఘాటుగా విమర్శలు కూడా చేస్తున్నారు . ఎందుకంటే సమంత నిన్న మొన్నటి వరకు కేవలం హీరోయిన్ మాత్రమే కానీ ఇప్పుడు అక్కినేని ఇంటి కోడలు కాబట్టి ఆ ఇంటి మర్యాద కాపాడాల్సిన అవసరం ఉందని పైగా అక్కినేని వంశానికి పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి వాళ్లంతా సమంత వేసుకున్న డ్రెస్ ని తప్పుపడుతున్నారు . ఎందుకంటే సమంత అందాలన్నీ ఆ డ్రెస్ లో బయట పడుతున్నాయి మరి అందుకే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు , సలహాలు ఇస్తున్నారు అయితే సమంత మాత్రం వాటిని పట్టించుకునే బాపతు కాదు మరి .

- Advertisement -

English Title: actress Samantha trolled for wearing short dress

 

View this post on Instagram

 

Inner peace ?

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All