Homeటాప్ స్టోరీస్క‌థ‌ల ఎంపిక‌లో చిన్న క‌న్ఫ్యూజ‌న్ వుండేది : న‌వ‌దీప్‌

క‌థ‌ల ఎంపిక‌లో చిన్న క‌న్ఫ్యూజ‌న్ వుండేది : న‌వ‌దీప్‌

క‌థ‌ల ఎంపిక‌లో చిన్న క‌న్ఫ్యూజ‌న్ వుండేది : న‌వ‌దీప్‌
క‌థ‌ల ఎంపిక‌లో చిన్న క‌న్ఫ్యూజ‌న్ వుండేది : న‌వ‌దీప్‌

`వ‌రుస ప‌రాజ‌యాలు నా ఆలోచ‌నా విధాన్ని మార్చేశాయి. నాలో లోటుప‌పాట్లు బాగా తెలిసొచ్చాయి. అందుకే ఇక‌పై నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన ప్రతీదీ చేయ‌కుండా ఆచితూచి అడుగువేయాల‌ని అనుకుంటున్నా. ఇక‌పై మ‌నసుకు న‌చ్చిన క‌థ‌ల‌తోనే ప్ర‌యాణం చేయాల‌ని బ‌లంగా నిర్ణ‌యించుకున్నా` అన్నారు న‌వ‌దీప్‌. ఆయ‌న న‌టిస్తున్న చిత్రం `మోస‌గాళ్లు`. మంచు విష్ణు హీరోగా న‌టిస్తూ నిర్మించారు. కాజ‌ల్ అగ‌ర్వాల్, సునీల్‌శెట్టి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. జెఫ్రీ గీచిన్ ద‌ర్శ‌కుడు. ఈ నెల 19న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా న‌వ‌దీప్ మీడియాతో ముచ్చ‌టించారు.

వైట్ కాల‌ర్ నేర‌గాడిగా..
భార‌త దేశానికి చెందిన అక్కా త‌మ్ముళ్లు .. ఇక్క‌డి నుంచే అమెరికాలో భారీ ఐటీ కుంభ‌కోణానికి పాల్ప‌డ‌తారు. అది ఎలా చేశార‌న్న‌దే ఈ చిత్ర ప్ర‌ధాన క‌థాంశం. ఈ సినిమాని తెలుగు, ఇంగ్లీష్‌లో రూపొందించారు. ఇందులో సునీల్‌శెట్టి త‌ప్ప అంతా మోస‌గాళ్లే. ఇందులో నేను విష్ణుకు స‌హాయ‌ప‌డే వైట్ కాల‌ర్ నేర‌గాడిగా క‌నిపిస్తా. స్కామ్‌లు చేస్తూ విలాస‌వంత‌మైన జీవితాన్ని ఆస్వాదిస్తుంటా. విష్ణుకి ఓ స్కామ్ విష‌యంలో సాయం చేస్తా. అయితే అదే స‌మ‌యంలో త‌న సోద‌రి ఇచ్చిన ఐడియాతో త‌ను అంద‌నంత ఎత్తుకు ఎదుగుతాడు. న‌న్ను ప‌క్క‌న పెట్టి మ‌రో పెద్ద మోసానికి రంగం సిద్ధం చేస్తాడు. అదేంట‌న్న‌ది మిగ‌తా క‌థ‌.

- Advertisement -

ప్ర‌తినాయ‌క ఛాయ‌లున్న పాత్ర‌లో..
ఈ సినిమా వ‌ల్ల ఇప్ప‌టి వ‌ర‌కు తెలియ‌ని ఎన్నో కొత్త విష‌యాలు నేర్చుకున్నా. హాలీవుడ్ నిపుణులు ఎలా ప‌ని చేస్తారు? స‌న్నివేశాల‌ను తెర‌కెకెక్కించ‌డంలో వారి ఆలోచ‌నా శైలి ఎలా వుంటుంది?.. వ‌ంటి ఎన్నో విష‌యాలు నేర్చుకున్నా. ఇందులో కాజ‌ల్ ఎత్తుకు పై ఎత్తులు వేసే ప్ర‌తినాయ‌క ఛాయ‌లున్న పాత్ర‌లో ద‌ర్శ‌న‌మిస్తుంది. తెలుగు, ఇంగ్లీష్ భాష‌ల్లో చూపించే క‌థ ఒక‌టే అయినా రెండింటిలో క‌నిపించే భావోద్వేగాలు భిన్నంగా వుంటాయి.

క‌‌థ‌ల ఎంపిక‌లో..
క‌‌థ‌ల ఎంపిక‌లో నాకు మొద‌టి నుంచి చిన్న క‌న్ఫ్యూజ‌న్ వుండేది. మ‌న‌సుకు న‌చ్చింది చేయాలా? మ‌న ద‌గ్గ‌రికి వ‌చ్చిన క‌థ‌లు చేసుకుంటూ పోవాలా.. అనే గంద‌ర‌గోళం ఉండేది. నిజానికి ఈ స‌మ‌స్య స‌రైన స‌క్సెస్ లేని న‌టుల‌కే వ‌స్తుంది. ఇలాంటి స‌మ‌యంలో పెద్ద నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు స్క్రిప్ట్‌లు తీసుకొచ్చిన‌ప్పుడు అవిన‌చ్చ‌కున్నా నో చెప్ప‌లేక‌పోయే వాడిని. దాంతో చాలా ప‌రాజ‌యాలు చ‌విచూశా. ఇప్పుడు దీనికి ప‌రిష్కారం క‌నుక్కున్నా. షూటింగ్ లేక‌పోతే కాస్త డ‌బ్బులు త‌క్కువ ఖ‌ర్చు పెట్టుకొని వేరే ప‌నులు చేసుకో కానీ పిచ్చి పిచ్చిగా చేయొద్ద‌ని నాకు నును చెప్పుకొన్నా.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All