
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ `మోసగాళ్లు`. హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీచిన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కాజల్ అగర్వాల్ కీలక పాత్రలో నటిస్తోంది. మంచు విష్ణు నటిస్తూ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్ కోసం స్టార్ హీరో స్టైలిసష్ స్టార్ అల్లు అర్జున్ సపోర్ట్ గా నిలుస్తున్నారు. ఈ మూవీ ఐటీ స్కామ్ నేపథ్యంలో రూపొందుతోంది.
ఆ స్కామ్ ఏ స్థాయిలో ఇండియాతో పాటు అమెరికాని వణికించిందో స్టైలిష్ స్టార్ రివీల్ చేయబోతున్నారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన `మోసగాళ్లు` థీమ్ మ్యూజిక్‌ని ఇటీవల విక్టరీ వెంకటేష్ విడుదల చేశారు. శ్యామ్ సిఎస్ సంగీతం అందించిన ఈ మూవీ నేపథ్య సంగీతానికి మంచి స్పందన లభించింది.
తాజాగా `మోసగాళ్లు` చేసిన స్కామ్ ఏ స్థాయితో బయటపెట్టేందుకు అల్లు అర్జున్ ముందు కొచ్చారు. అక్టోబర్ 3న ఈ స్కామ్ వివరాల్ని సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ రిలీజ్ చేయబోతున్నారు.
భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ క్రాస్ ఓవర్ ఫిల్మ్ ని నిర్మాతలు విలక్షణంగా విస్తృతంగా ప్రమోట్ చేస్తున్నారు. భారత్‌లో మొదలై ఆమెరికాను వణికించిన చరిత్రలోనే అతిపెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యంలో వాస్తవ ఘటనల ఆధారంగా `మోసగాళ్లు` చిత్రం రూపొందుతోంది. ఇందులో కాజల్ అగర్వాల్ హీరో మంచు విష్ణుకు చెల్లెలిగా నటిస్తోంది. బాలీవుడ్ హీరో సునీల్‌శెట్టి ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. నవదీప్, రుహీసింగ్ ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు.