
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లైనా ఎక్కడా తగ్గడం లేదు. పెళ్లికి ముందు సినిమాల విషయంలో ఎంత స్పీడుని ప్రదర్శించిందో పెళ్లి తరువాత కూడా అంతే స్పీడుని ప్రదర్శించింది. పెళ్లికి ముందు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న `ఆచార్య` చిత్రం చేస్తున్న కాజల్ ఈ శుక్రవారం విడుదలైన `మోసగాళ్లు`లోనూ మంచు విష్ణుకు అక్కగా నటించి షాకిచ్చింది.
ఇదిలా వుంటే తాజాగా కింగ్ నాగార్జునతో ఓ భారీ చిత్రానికి కాజల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో ఆమె పాత్ర రా ఏజెంట్ అని తెలిసింది. `పీఎస్‌వీ గరుడ వేగ` తరువాత ప్రవీణ్ సత్తారు ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఇందులో నాగ్ ఎక్స్ రా ఏజెంట్‌గా కనిపించనున్నారట. కంప్లీట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రంలో తన క్యారెక్టర్‌ని డిజైన్ చేసిన తీరు నచ్చడం వల్లే కాజల్ ఈ చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట.
ఇక ఇందులో నటించడానికి మరో ప్రత్యేకమైన కారణం కూడా వుందని కాజల్ తెలిపినట్టు తెలిసింది. కింగ్ నాగ్‌తో ఇంత వరకు కాజల్ కలిసి నటించిలేదు. పైగా ఆయనంటే కాజల్‌కు క్రష్ వుందట. ఆ కారణంగానే ఈ చిత్రంలో నటించడానికి కాజల్ అంగీకరించినట్టు తాజా గా తెలిసింది. అలాగే ఈ చిత్రంలోని తన పాత్ర కోసం కాజల్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకోబోతోంది.