Homeటాప్ స్టోరీస్హైద‌రాబాదీ గ‌ర్ల్ బాలీవుడ్‌కు సినిమా చూపిస్తుంద‌ట‌!

హైద‌రాబాదీ గ‌ర్ల్ బాలీవుడ్‌కు సినిమా చూపిస్తుంద‌ట‌!

Hyderabad Girl Amrin Qureshi Bollywood Films
Hyderabad Girl Amrin Qureshi Bollywood Films

ర‌చ్చ గెలిచి ఇంటి గెల‌వ‌మ‌న్నారు పెద్ద‌లు. హైద‌రాబాదీ గ‌ర్ల్ అదే సూత్రాన్ని పాటిస్తోంది. తెలుగులో స్థానిక అమ్మాల‌కు హీరోయిన్‌లుగా పెద్ద‌గా ప్రాధాన్య‌త‌నివ్వ‌ర‌న్న‌ది చాలా సంద‌ర్భాల్లో నిరూపిత‌మైంది. ఈషా రెబ్బా లాంటి వాళ్లు ఇప్ప‌టికీ చెప్పుకోద‌గ్గ అవ‌కాశం రాక స‌రైన ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే  హైద‌రాబాదీ గ‌ర్ల్ మాత్రం ఏకంగా బాలీవుడ్‌లోనే బంప‌ర్ ఆఫ‌ర్ల‌ని కొట్టేసింది.

ఆమె అమ్రిన్ ఖురేషీ. అందాల పోటీల్లో మెరిసిన ఈ అందాల భామ బాలీవుడ్‌లో పేరున్న ద‌ర్శ‌కుడు రాజ్ కుమార్ సంతోషి చిత్రంలో న‌టించే అవ‌కాశాన్ని దక్కించుకుంది. ఇది ఆమెకు హీరోయిన్‌గా తొలి చిత్రం. తెలుగులో రాజ్ త‌రుణ్ హీరోగా న‌టించిన `సినిమా చూపిస్త మావా` ఆధారంగా ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. `బ్యాడ్ బాయ్‌` పేరుతో రీమేక్ అవుతున్న ఈ మూవీతో అమ్రిన్ ఖురేషీ బాలీవుడ్‌లో అడుగుపెడుతోంది.

- Advertisement -

ఇందులో మిథున్‌చ‌క్ర‌వ‌ర్తి త‌న‌యుడు న‌మ‌షి చ‌క్ర‌వ‌ర్తి ఇందులో హీరోగా న‌టిస్తున్నాడు.  ఘాయ‌ల్‌, డోలీ స‌జాకె ర‌ఖ్‌నా, ది లిజెండ్ ఆఫ్ భ‌గ‌త్‌సింగ్‌, ఖాకీ వంటి భారీ చిత్రాల ద‌ర్శ‌కుడిగా రాజ్‌కుమార్ సంతోషికి మంచి పేరుంది. అలాంటి ద‌ర్శ‌కుడి చిత్రం ద్వారా బాలీవుడ్‌కు అమ్రిన్ ఖురేషీ ప‌రిచ‌యం అవుతుండ‌టం విశేషంగా చెబుతున్నారు. ఇక ఈ మూవీతో పాటు అమ్రిన్ ఖురేషీ మ‌రో బాలీవుడ్ చిత్రంలో న‌టించ‌బోతోంది. అది కూడా తెలుగు సినిమా ఆధారంగా రూపొంద‌బోతోంది. అల్లు అర్జున్ న‌టించిన `జులాయి` ఆధారంగా ఈ మూవీని రీమేక్ చేయ‌బోతున్నారు. దీనికి టోని డిసౌజా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. జ‌న‌వ‌రి నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. కియారా అద్వానీని పోలి వున్న అమ్రిన్ ఖురేషీ బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ బిజీ కావ‌డం ఖాయం అని చెబుతున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All