
టాలీవుడ్ ఇండస్ట్రీలో పెళ్లిళ్ల హంగామా నడుస్తోంది. మునుపెన్నడూ లేని విధింగా ఈ ఏడాది చాలా మంది స్టార్ హీరోలు, డైరెక్టర్‌లు, నిర్మాతలు వివాహం చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవలే దిల్ రాజు, నిఖిల్, నిన్నటికి నిన్న నితిన్ … వివాహాలు చేసుకున్నారు. ఈ నెల 8న రానా వివాహం మిహీకా బజాజ్‌తో తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరగనున్న విషయం తెలిసిందే. తాజాగా `సాహో` డైరెక్టర్ కూడా సైలెంట్‌గా వివాహం చేసుకున్నారు.
రన్ రాజా రన్ చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న సుజీత్ ఆ తరువాత చేసిన `సాహో`తో స్టార్ డైరెక్టర్‌ల జాబితాలో చేరిపోయారు. గత నెలలో హైదరాబాదీ అమ్మాయి ప్రవల్లికతో సుజీత్ ఎంగేజ్‌మెంట్ జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా. తాజాగా వీరి వివాహం జరిగింది. సిల్క్ కుర్తాలో సుజీత్, గులాబీ రంగు సిల్క్ సారీలో ప్రవల్లిక మెరిసిపోయారు.
అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వివాహంలో పాల్గొన్నారు. కరోనా కారణంగా ఇండస్ట్రీకి సంబంధించిన ఏ సెలబ్రిటీ కూడా ఈ వెడ్డింగ్‌లో పాల్గొనలేదు. వెల్లడింగ్ ఫొటోని షేర్ చేస్తూ మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ సుజీత్ వివాహం చేసుకున్నారన్న విషయాన్ని బయటపెట్టింది. `నా ప్రియమైన స్నేహితుడు సుజిత్ సింగ్ జీవిత కాలం ఆనందంగా వుండాలని కోరుకుంటున్నాను. వీరిద్దరూ ఎప్పటికీ ఒకరిపై ఒకరు ప్రేమను కురిపించుకుంటూ సంతోషంగా వుండాలి` అని పోస్ట్ చేశారు.