Homeటాప్ స్టోరీస్10 కోట్ల వసూళ్లు కూడా సాధించలేకపోయాడు

10 కోట్ల వసూళ్లు కూడా సాధించలేకపోయాడు

Manmadhudu 2
Manmadhudu 2

సీనియర్ హీరో అక్కినేని నాగార్జున తాజాగా నటించిన మన్మథుడు 2 చిత్రంతో పట్టుమని 10 కోట్లు కూడా సాధించలేకపోయాడు దాంతో మన్మథుడు 2 డిజాస్టర్ జాబితాలో చేరిపోయింది . ఆగస్టు 9 న భారీ ఎత్తున విడుదలైన మన్మథుడు 2 చిత్రం పై నాగార్జున ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు . కానీ నాగార్జున ఆశలన్నీ అడియాసలయ్యాయి మన్మథుడు 2 డిజాస్టర్ తో . నాగార్జున కు డిజాస్టర్ లు కొత్తకాదు కానీ మన్మథుడు సూపర్ హిట్ ఆ పేరుతో వస్తున్న చిత్రం కాబట్టి అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి .

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది . రెండు తెలుగు రాష్ట్రాలలో 7 కోట్లకు పైగా షేర్ రాగా కర్ణాటకలో కోటికి పైగా షేర్ వచ్చింది , ఇక ఓవర్ సీస్ లో అయితే మొత్తంగానే కోటి వసూల్ చేయలేక చతికిల బడ్డాడు మన్మథుడు 2 . దాంతో నాగార్జున మరో డిజాస్టర్ అందుకున్నాడు . అయితే నాగార్జున కానీ , ఈ సినిమాని నిర్మాణ భాగస్వామిగా ఉన్నవాళ్లు కానీ లాభాలు తెచ్చుకున్నారు సాటిలైట్ , డిజిటల్ రైట్స్ , హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలో . కానీ నష్టపోయింది బయ్యర్లు మాత్రమే !

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All