Homeటాప్ స్టోరీస్మన్మథుడు 2 రివ్యూ

మన్మథుడు 2 రివ్యూ

Manmadhudu 2 Review in Telugu

నటీనటులు : అక్కినేని నాగార్జున , రకుల్ ప్రీత్ సింగ్ , వెన్నెల కిషోర్ 
సంగీతం : చేతన్ భరద్వాజ్
నిర్మాతలు : నాగార్జున , జెమిని కిరణ్
దర్శకత్వం : రాహుల్ రవీంద్రన్
రేటింగ్ : 3/5
రిలీజ్ డేట్ : 9ఆగస్టు 2019

- Advertisement -

17 ఏళ్ల క్రితం వచ్చిన మన్మథుడు సూపర్ హిట్ ఐన విషయం తెలిసిందే . ఇన్నాళ్లకు మళ్ళీ అదే టైటిల్ తో దానికి కొనసాగింపుగా 2 ని చేర్చి నాగార్జున చేసిన ప్రయత్నం మన్మథుడు 2 . అయితే ఇది ఆ సినిమాకు సీక్వెల్ కానప్పటికీ అంచనాలు అయితే బాగానే ఏర్పడ్డాయి ఈ సినిమా మీద . మరి ఆ అంచనాలను నాగ్ అందుకున్నాడా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే .

కథ :
తొలిసారి ప్రేమలో విఫలం కావడంతో ఆగ్రహం చెందిన సామ్ అలియాస్ సాంబశివరావు ( అక్కినేని నాగార్జున ) ప్లే బాయ్ లా మారతాడు . కనిపించిన అమ్మాయిని ఫ్లర్ట్ చేస్తుంటాడు . అయితే ఏజ్ బార్ అవుతోంది కాబట్టి త్వరగా పెళ్లి చేసుకోమని ఇంట్లో పోరు పెడుతుంటారు . ఇంట్లో వాళ్ళ పోరు పడలేక అవంతిక ( రకుల్ ప్రీత్ సింగ్ ) తో కలిసి తన పెళ్లి చెడగొట్టే పనులు మొదలు పెడతాడు . అయితే ఈ క్రమంలో ఎలాంటిసంఘటనలు జరిగాయి ? చివరకు ఏమైంది అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :
నాగార్జున
రకుల్ ప్రీత్ సింగ్
వెన్నెల కిషోర్ కామెడీ
విజువల్స్

డ్రా బ్యాక్స్ :
సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాలు
క్లైమాక్స్

నటీనటుల ప్రతిభ :
నాగార్జున ఈ వయసులో కూడా మన్మథుడు అనిపించాడు . నాగార్జున – రకుల్ ప్రీత్ సింగ్ ల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి . అలాగే నాగార్జున వెన్నెల కిషోర్ కామెడీ కూడా నవ్విస్తుంది . ఇక నటన పరంగా రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే . ఆధునిక భావాలున్న యువతిగా నటించిన రకుల్ కు ఇన్నాళ్లకు నటన పరంగా చెప్పుకోదగ్గ పాత్ర లభించింది . ఇకవైపు గ్లామర్ తో అలరిస్తూనే మరోవైపు నటనతో ఆకట్టుకుంది . ఇక స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చిన సమంత , కీర్తి సురేష్ అలరించారు . మిగిలిన పాత్రల్లో సీనియర్ నటి లక్ష్మీ , రావు రమేష్ , ఝాన్సీ , దేవదర్శిని , తమ తమ పాత్రల్లో మెప్పించారు .

సాంకేతిక వర్గం :
చేతన్ భరద్వాజ్ అందించిన పాటల్లో 3 బాగున్నాయి , రీ రికార్డింగ్ ఫరవాలేదు , అయితే ఈ సినిమాకు హైలెట్ సుకుమార్ అందించిన ఛాయాగ్రహణం అనే చెప్పాలి . విజువల్ గా చాలా బాగుందంటే కారణం ఒకటి నిర్మాణ విలువలు రెండోది సుకుమార్ టేకింగ్ , నాగార్జున ని చాలా బాగా చూపించాడు అలాగే రకుల్ గ్లామర్ ని బాగా ఒడిసి పట్టాడు సుకుమార్ . ఇక దర్శకుడు రాహుల్ రవీంద్రన్ విషయానికి వస్తే ……. ఎంటర్ టైనర్ గా తీర్చి దిద్దడంలో విజయం సాధించాడు అయితే ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే మన్మథుడు చిత్రాన్ని అవలీలగా అధిగమించేది ఈ మన్మథుడు 2 . సెకండాఫ్ లో అక్కడక్కడా కాస్త తడబడ్డట్లు అనిపించింది . కానీ ఓవరాల్ గా డైరెక్టర్ గా మెప్పించాడు రాహుల్ .

ఓవరాల్ గా :
మన్మథుడు 2 మంచి ఎంటర్ టైనర్

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All