Homeటాప్ స్టోరీస్కరోనా పేరు మీద భారీగా టైటిల్స్ రిజిస్ట్రేషన్లు

కరోనా పేరు మీద భారీగా టైటిల్స్ రిజిస్ట్రేషన్లు

కరోనా పేరు మీద భారీగా టైటిల్స్  రిజిస్ట్రేషన్లు
కరోనా పేరు మీద భారీగా టైటిల్స్ రిజిస్ట్రేషన్లు

ప్రపంచవ్యాప్తంగా ఏదైనా ఒక సంచలనమైన సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటన ఆధారంగా సినిమా వాళ్ళు సినిమాలు తీయటం మామూలు విషయమే. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో తరువాత కరోనా వైరస్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు తీయాలని ఇప్పటికే దర్శక నిర్మాతలు కరోనా అనే పేరుమీద టైటిల్స్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. ఇండస్ట్రీలో ఇప్పటికే రిజిస్టర్ అయిన “మెడికల్ మాఫియా” మరియు “వైరస్ బ్రేక్ అవుట్” నేపథ్యంలో ఉన్న కథలన్నీ ఒకసారి రీరైట్ చేసుకుంటున్నారు. మన తెలుగులో ఒక సబ్జెక్ట్ ని లోతుగా డిస్కస్ చేయటం కొంత తక్కువగా ఉంటుంది. ఎక్కువ శాతం కథానాయకుడి పాత్ర ఎలివేషన్ ఎక్కువగా ఉంటుంది. కానీ తమిళం,కన్నడం,మలయాళం ఇండస్ట్రీలో అలా కాదు.. అక్కడ ఎక్కువ శాతం కథ ప్రధాన పాత్ర పోషిస్తుంది.

ఇక గతంలో కూడా “వైరస్ బ్రేకవుట్” మరియు మెడికల్ మాఫియా నేపథ్యంలో పలు సినిమాలు వచ్చాయి. లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన “దశావతారం”; తమిళ హీరో జీవా నటించిన “ఈ”; అదేవిధంగా రీసెంట్ గా కలకలం సృష్టించిన నిఫా వైరస్ ఆధారంగా మలయాళంలో వచ్చిన “వైరస్” సినిమా ఉదాహరణలుగా మనం చెప్పుకోవచ్చు.ఇక అందరూ పనులు మానేసి ఇళ్లల్లో కూర్చుంటున్న నేపథ్యంలో డిజిటల్ వేదికలపై కూడా గత వారం పది రోజులుగా మెడికల్ మాఫియా మరియు వైరస్ breakout నేపథ్యంలో వచ్చిన సినిమాల ను వీక్షించిన వారి సంఖ్య మరియు డౌన్లోడ్ చేసే వారి సంఖ్య బాగా పెరిగినట్లు సమాచారం. వాతావరణంలో ఉన్నట్లుండి ఇలాంటి వైరస్ లు విజృంభించి మనుషుల ప్రాణాలకు హాని కలిగించే నేపథ్యంలో… ప్రస్తుతం మనం ఉన్న సమాజంలో ఒక మనిషిగా మన వ్యక్తిగత మరియు సామాజిక బాధ్యతలు ఏంటి.? అనేది ఇందులో కొన్ని సినిమాల్లో అద్భుతంగా చూపించారు. ముఖ్యంగా మలయాళంలో ఇటీవల వచ్చిన “వైరస్” సినిమా ఇందుకు ఒక ఉదాహరణ. ఇక దేశవ్యాప్తంగా ఎలాంటి సంఘటన జరిగిన ఆ సంఘటన ఆధారంగా సినిమాలు తీసే రామ్ గోపాల్ వర్మ లాంటి వారు కూడా ఇప్పటికే కరోనా వైరస్ సబ్జెక్టు మీద కథ చర్చలు నడుపుతున్నట్లు సమాచారం.

- Advertisement -

ఏది ఏమైనా ఇలాంటి సినిమాల ద్వారా ప్రజలకు మరింత అవగాహన కలిగి, అపోహలు తొలగిపోయి,సామాజికంగా బాధ్యత నేర్చుకొని, ఇలాంటి మహమ్మారులను అరికట్టే విధంగా జ్ఞానం పెంపొందించుకుంటే బాగుంటుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All