Homeటాప్ స్టోరీస్30 కోట్లతో కొత్త హీరోతో సినిమానా ?

30 కోట్లతో కొత్త హీరోతో సినిమానా ?

Huge budjet for sharabhaశరభ అనే చిత్రాన్ని 30 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు కొత్త దర్శకుడు నరసింహారావు . గతంలో శంకర్ దగ్గర పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేసిన నరసింహారావు తొలిసారిగా మెగాఫోన్ పట్టిన చిత్రం శరభ . ఆకాష్ కుమార్ ని హీరోగా పరిచయం చేస్తూ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించారు . వజ్రాల వ్యాపారాలు ఈ సినిమాని నిర్మించడంతో ఖర్చుకు వెనుకాడకుండా ఖర్చు పెట్టారు . కొత్త హీరోతో ముప్పై కోట్ల బడ్జెట్ అంటే అది చాలా చాలా ఎక్కువ . పెద్ద హీరోల సినిమాలకు సైతం సినిమా బాగోలేదంటే కలెక్షన్లు రావడం లేదు , ఇక కొత్త హీరో అంటే ఓపెనింగ్స్ ఎలాగూ ఉండవు సినిమా బాగుంది అంటేనే జనాలు వస్తారు . లేదంటే డబ్బంతా బూడిదలో పోసిన పన్నీరే !

కొత్త దర్శకుడు , కొత్త హీరో ఫెడవుట్ అయిన జయప్రద ఈ సినిమాలో కీలక పాత్ర పోషించింది దాంతో ఈ సినిమా విజయం పై అంతగా అంచనాలు లేవు . అలాగే భారీగా ఖర్చు పెట్టి సినిమా తీశారు కానీ పబ్లిసిటీ మాత్రం చేయడం లేదు . దైవ భక్తికి , క్షుద్ర శక్తి కి మధ్యన సాగే యుద్ధం కథాంశంతో ఈ శరభ తెరకెక్కింది . గ్రాఫిక్స్ ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని నవంబర్ 15 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . అయితే నవంబర్ 15 న విడుదల అవుతుందా ? అంటే డౌటే అనిపిస్తోంది ఎందుకంటే నవంబర్ 16 న రవితేజ అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రం , నవంబర్ 17 న విజయ్ దేవరకొండ నటించిన టాక్సీ వాలా చిత్రం విడుదల అవుతున్నాయి మరి .

- Advertisement -

English Title: Huge budjet for sharabha

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All