Homeటాప్ స్టోరీస్జూన్ 1న నాలుగు సినిమాలు

జూన్ 1న నాలుగు సినిమాలు

four movies release on june 1stజూన్ 1న నాలుగు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి . ఈ వేసవిలో రంగస్థలం , భరత్ అనే నేను , మహానటి చిత్రాలు బ్లాక్ బస్టర్ లుగా నిలిచాయి . వరుసగా మూడు చిత్రాలు కలెక్షన్ల వర్షం కురిపించడంతో బయ్యర్లు సంతోషంలో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు అయితే అదే సమయంలో వచ్చిన మిగతా చిత్రాలు ప్లాప్ అయ్యాయి . తాజాగా మహానటి మంచి వసూళ్ల ని సాధిస్తోంది , ఆ సినిమాకు సరైన సినిమా ఏది పోటీ లేదు .

ఇక ఈవారం జూన్ 1న విశాల్ హీరోగా నటించిన ” అభిమన్యుడు ” , రాజ్ తరుణ్రాజుగాడు ” , కొత్త హీరో చిత్రం ” శరభ ” చిత్రాలతో పాటు కింగ్ నాగార్జున నటించిన ” ఆఫీసర్ ” చిత్రం విడుదల అవుతున్నాయి . అభిమన్యుడు తమిళంలో బ్లాక్ బస్టర్ అయ్యింది పైగా డిజిటల్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం కావడంతో ఆ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి . వర్మ దర్శకత్వంలో వస్తున్న చిత్రాలన్నీ ఘోర పరాజయాలు పొందుతున్నాయి దాంతో నాగ్ ఆఫీసర్ చిత్రంపై పెద్దగా అంచనాలు లేవు కాకపోతే నాగార్జున హీరో కాబట్టి ఓపెనింగ్స్ అయితే ఉంటాయి . సినిమా బాగుంటే ఫ్యాన్స్ బ్రహ్మరథం పడతారు లేదంటే అంతేసంగతులు . ఇక రాజ్ తరుణ్ రాజు గాడు పై కూడా పెద్దగా అంచనాలు లేవు అలాగే శరభ సినిమా పై కూడా . జూన్ 1న విడుదల అవుతున్న ఈ నాలుగు చిత్రాల్లో ఏది హిట్ అవుతుందో ? ఏవి ప్లాప్ అవుతాయో ? ఏ సినిమా విడుదల కాకుండా ఆగిపోతుందో చూడాలి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All