Homeటాప్ స్టోరీస్ప్లాప్ నిర్మాత అయినా ఎక్కడా తగ్గట్లేదు!!

ప్లాప్ నిర్మాత అయినా ఎక్కడా తగ్గట్లేదు!!

ప్లాప్ నిర్మాత అయినా ఎక్కడా తగ్గట్లేదు!!
ప్లాప్ నిర్మాత అయినా ఎక్కడా తగ్గట్లేదు!!

హీరోలు, దర్శకులకే కాదు నిర్మాతలకు కూడా సినిమాలు హిట్ అవ్వడం ఎంతో ముఖ్యం. సినిమాలు విజయాలు సాధించకుండా, ప్లాపులు అవుతుంటే మరో సినిమా నిర్మించడానికి ఏ నిర్మాత కూడా సాహసం చేయడు. ఎందుకంటే సినిమా ప్లాప్ అయిందంటే హీరోలు, హీరోయిన్లు, దర్శకులకు కెరీర్ మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. ఆ సినిమాకు రావాల్సిన రెమ్యునరేషన్ ముందే తీసేసుకుంటారు కాబట్టి అక్కడి వరకూ ఫైన్. అదే నిర్మాతకు అయితే కెరీర్ తో పాటు ఫైనాన్సియల్ గా కూడా డేంజర్ లో పడతాడు. అప్పటికే కట్టుకోవాల్సినవి, బాకీలు తీర్చుకోవాల్సినవి నిర్మాతకు చాలానే ఉంటాయి. అందుకే సినిమాల విజయాల శాతం బాగా తగ్గిపోయినా ఇంకా కొంత మంది సినిమాల మీద ప్యాషన్ తోనే నిర్మాణ రంగంలో కంటిన్యూ అవుతున్నారు. అవే డబ్బులు వేరే రంగాలలో పెట్టుకుంటే దీనికి రెట్టించిన లాభాలు సంపాదించుకోవచ్చు.

ఇప్పుడు చెప్పినదానికి ఉదాహరణగా ఒక నిర్మాత గురించి ప్రస్తావించుకోవచ్చు. పేరుకి తక్కువ సినిమాలే తీసినా అన్నీ కూడా భారీ బడ్జెట్ లే తీసాడు. అయితే ఈ నిర్మాత తీసిన రెండు సినిమాలూ కూడా దారుణమైన ప్లాపులుగా మిగిలాయి. ఈ నిర్మాత మరెవరో కాదు మిర్యాల రవీందర్ రెడ్డి. ఈయన ఒక బిజినెస్ మ్యాన్. తన తొలి సినిమా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా వచ్చిన సాహసం శ్వాసగా సాగిపో. మొదటి సినిమానే గౌతమ్ మీనన్ వంటి టాలెంటెడ్ దర్శకుడు దొరకడంతో ఈ నిర్మాత ఫుల్ ఖుషీ. అయితే సాహసం శ్వాసగా సాగిపో రిజల్ట్ ఏంటో మనందరికీ బాగా తెలుసు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు అటు బిజినెస్ సరిగ్గా అవ్వలేదు, ఇటు సినిమా ప్లాప్ కూడా అయింది. దీంతో మిర్యాల రవీందర్ రెడ్డికి మొదటి సినిమానే దారుణమైన దెబ్బగా మిగిలింది.

- Advertisement -

అయితే ఎలాగోలా తేరుకుని రెండో సినిమాను బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కించాడు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా బోయపాటి తెరకెక్కించిన జయ జానకి నాయక చిత్రానికి మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాత. ఈ సినిమా ఫలితం కూడా దారుణంగా బెడిసికొట్టింది. సినిమా టాక్ బాగానే వచ్చినా బెల్లంకొండ మార్కెట్ కు మించి రెండింతలు పెట్టుబడి పెట్టడం పెద్ద దెబ్బగా మిగిలింది. ఈ సినిమా కమర్షియల్ ఫెయిల్యూర్ అయింది. ఈ రెండు సినిమాలతో ఇక ఆ నిర్మాత తేరుకోడేమో అనుకున్నారు. కానీ మళ్ళీ బోయపాటితోనే తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నాడు. బాలకృష్ణ – బోయపాటి శ్రీను చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనున్నాడు. అయితే అందరూ ప్లాపుల్లో ఉన్నా కానీ సినిమా బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అయితే అవ్వరట. ఈ సినిమాకు దాదాపు 40 నుండి 50 కోట్ల వరకూ బడ్జెట్ వేసుకున్నట్లు ప్రాధమిక అంచనా. భారీ కాస్ట్ అండ్ క్రూ ను ఆల్రెడీ దించే ప్రయత్నంలో ఉన్నారు. విలన్ గా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ను తీసుకుంటారని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బాలయ్యకు 50 కోట్లు అంటే చాలా పెద్ద రిస్క్. మరి మూడో సినిమాతోనైనా ఈ నిర్మాత హిట్ అందుకుంటాడేమో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All