Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్- చరణ్ ల మద్య యుద్దమే

ఎన్టీఆర్- చరణ్ ల మద్య యుద్దమే

Huge Action sequens between ntr and charan from 19 th novemberఎన్టీఆర్చరణ్ ల మద్య భారీ పోరాట దృశ్యాలను చిత్రీకరించడానికి సమాయత్తం అవుతున్నాడు దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి . నిన్న భారీ ఎత్తున ఆర్ ఆర్ ఆర్ చిత్రం ప్రారంభమైన విషయం తెలిసిందే . ఎన్టీఆర్ గుబురు గడ్డంతో లావుగా తయారయ్యాడు . దాంతో ఈ సినిమాలో ఎన్టీఆర్ విభిన్న పాత్ర పోషించనున్నాడు అనేది ఇట్టే అర్దమై పోతోంది . దానికి తోడూ ఈనెల 19 నుండి ఎన్టీఆర్ చరణ్ ల పై భారీ యాక్షన్ సీక్వెన్స్ చేయబోతున్నామని ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు మేకర్స్ . రాజమౌళి దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నాడు .

అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ ఎత్తున వేసిన సెట్ లో సినిమా ప్రారంభం కాగా ఆ సెట్ లోనే భీకరమైన పోరాట దృశ్యాలను చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నాడు జక్కన్న . స్వాతంత్ర్యానికి ముందు ఎపిసోడ్ ఈ చిత్రానికి హైలెట్ గా నిలుస్తుందని తెలుస్తోంది . మొత్తానికి ఈ చిత్రంలో ఎన్టీఆర్ నెగెటివ్ రోల్ లో కనిపించనున్నట్లు సమాచారం . అందుకే కాబోలు ఈ సినిమాకు ” రామ రావణ రాజ్యం ” అనే టైటిల్ ని పెట్టాలనుకుంటున్నట్లు తెలుస్తోంది . ఎన్టీఆర్ – చరణ్ ల మద్య పోరాట దృశ్యాలు అంటే ఫ్యాన్స్ కి కేకో కేక . అయితే ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అన్నది మాత్రం జక్కన్న కు కూడా తెలియదనుకుంటా .

- Advertisement -

English Title: Huge Action sequence between ntr and charan from 19th november

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All