Homeటాప్ స్టోరీస్నిత్యా మీనన్ వ్యాఖ్యలపై కంగనా రియాక్షన్ ఎలా ఉంటుందో!

నిత్యా మీనన్ వ్యాఖ్యలపై కంగనా రియాక్షన్ ఎలా ఉంటుందో!

నిత్యా మీనన్ వ్యాఖ్యలపై కంగనా రియాక్షన్ ఎలా ఉంటుందో!
నిత్యా మీనన్ వ్యాఖ్యలపై కంగనా రియాక్షన్ ఎలా ఉంటుందో!

బాలీవుడ్ లో కంగనా స్టయిలే వేరు. ఆమెను ఒక ఫైర్ బ్రాండ్ లా చూస్తారు అందరూ. ఏదైనా ఆమె విషయం వస్తే వామ్మో ఆమెతో ఎందుకులే అనుకుని పక్కకు తప్పుకుంటారు. కొందరు సాఫ్ట్ వ్యక్తులైతే ఆమె గురించి మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. మళ్ళీ ఏం మాట్లాడితే ఏం గొడవ జరుగుతుందో అని లైట్ తీసుకుంటారు. కొంతమంది డేర్ చేసి మాట్లాడినా కంగనా ఫైర్ ముందు వాళ్ళు నిలవలేరు. ఎంత దిగజారుడు వ్యాఖ్యలు చేయడానికైనా ఆమె వెనుకాడదు. ఒకవేళ ఆమె తగ్గినా ఆమె చెల్లెలు అస్సలు తగ్గదు. తనకు సంబంధం లేని వ్యవహారాల్లో తల దూర్చి మొత్తం పెంట పెంట చేసేస్తుంటుంది. హ్రితిక్ రోషన్ వంటి పెద్ద హీరోనే గడగడలాడించింది కంగనా. తనతో పెట్టుకోలేక ఒక దణ్ణం పెట్టి పక్కకుతప్పుకున్నాడు. మణికర్ణిక వివాదంలో క్రిష్ తో పోరు ఎలా సాగిందో మనం చూసాం. న్యాయం క్రిష్ వైపు ఉన్నా ఏం చేయలేని పరిస్థితి. అంతలా కంగనా వ్యవహరించింది. హీరోయిన్స్ ను కూడా కంగనా వదిలిపెట్టింది లేదు. ఆమె జోలికి రాకున్నా సరే తాప్సి, అలియా భట్ వంటి హీరోయిన్లను కంగనా చాలా ఇబ్బంది పెట్టింది. వాళ్ళను కావాలని కవ్వించింది. అందుకే కంగనా అంటేనే భయపడే పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో ఎక్కువగా మీడియా ముందుకు రావడానికే ఇష్టపడని నిత్యా మీనన్, కంగనాపై ఇండైరెక్ట్ సెటైర్లు వేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ వివరాల్లోకి వెళితే..

కంగనా రనౌత్ ప్రస్తుతం జయలలిత బయోపిక్ తలైవి చిత్రంలో నటిస్తున్న సంగతి తెల్సిందే. మరోవైపు నిత్య మీనన్ కూడా మరో జయలలిత బయోపిక్ లో నటిస్తోంది. ఈ సినిమా పేరు ఐరన్ లేడీ. ప్రియదర్శిని దర్శకత్వం వహిస్తున్నారు. తలైవి చిత్రానికి ఏ.ఎల్.విజయ్ దర్శకుడు. ప్రముఖ ఫిల్మ్ మేకర్ భారతి రాజా కూడా జయలలితపై బయోపిక్ తీస్తున్నట్లు ప్రకటించాడు. అలాగే గౌతమ్ మీనన్ ప్రస్తుతం ఆమె జీవితంపై వెబ్ సిరీస్ ను తీసే పనిలో ఉన్నాడు. వీటన్నిటిలో తలైవి పెద్ద ప్రాజెక్ట్. ఇటీవలే ఈ సినిమా మోషన్ పోస్టర్ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఇందులో కంగనా లుక్ పై మిశ్రమ స్పందన లభించింది. స్వతహాగా సన్నగా ఉండే కంగనా బొద్దుగా మొహం ఉండే అమ్మ పాత్రకు సెట్ అవ్వలేదు. మేకప్ మ్యాన్ ఎంత కష్టపడ్డా కానీ పెర్ఫెక్షన్ రాలేదు. కంగనా లుక్ పై బోలెడు ట్రోల్స్ కూడా వచ్చాయి.

- Advertisement -

అయితే నిత్యా మీనన్ ఈ విషయంలో అనవసరంగా తలదూర్చిందేమో అనిపిస్తుంది. కంగనా లుక్ పై ఎవరెన్ని బయోపిక్ లు తీసినా వాటికి నేనే పెర్ఫెక్ట్ గా సెట్ అవుతాను అంటూ పెద్ద దుమారమే రేపింది. రేప్పొద్దున్న సినిమా చూసాక అందరూ ఈ విషయం ఒప్పుకుంటారని వ్యాఖ్యానించింది. దీనిబట్టి కంగనా అమ్మ రోల్ కు సరిపోదని ఆమె వ్యాఖ్యానించినట్టేనని సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు. తనని అనకపోతేనే రెచ్చిపోయే కంగనా, ఇప్పుడు నిత్యామీనన్ ను ఏం చేస్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All