Homeగాసిప్స్అలా మహేష్ సినిమాకు మూడు నిర్మాణ సంస్థలు వచ్చాయి..

అలా మహేష్ సినిమాకు మూడు నిర్మాణ సంస్థలు వచ్చాయి..

అలా మహేష్ సినిమాకు మూడు నిర్మాణ సంస్థలు వచ్చాయి..
అలా మహేష్ సినిమాకు మూడు నిర్మాణ సంస్థలు వచ్చాయి..

ఇప్పుడు ఇదే ట్రెండ్ అవుతోంది. ఇదివరకు ఏదైనా సినిమా తెరకెక్కుతుందంటే నిర్మాత ఎవరు అడిగేవారు కానీ ఇప్పుడు ఎవరెవరు కలిసి నిర్మిస్తున్నారు అని అడుగుతున్నారు. భారీ బడ్జెట్ ల కారణంతో ప్రొడక్షన్ భారంగా మారడంతో రెండు, మూడు నిర్మాణ సంస్థలు కలిసి సినిమాలను నిర్మిస్తున్నాయి. వచ్చిన లాభాల్లో వాటాలు వేసుకుంటున్నాయి. దీని వల్ల నిర్మాతలకు కొంత ఊరట లభిస్తోంది. లాభాలు తగ్గుతున్నా రిస్క్ కూడా తగ్గుతుండడంతో ప్రశాంతంగా ఉంటున్నారు. గతేడాది వచ్చిన వెంకీ మామ, ప్రతిరోజూ పండగే, ఈ సంక్రాంతికి వచ్చిన సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో ఇలా అన్ని సినిమాలకు రెండు నిర్మాణ సంస్థలు ఉన్నాయి.

సరిలేరు నీకెవ్వరు చిత్రానికైతే మహేష్ కూడా ఒక నిర్మాత కాబట్టి మొత్తం మూడు నిర్మాణ సంస్థలు వచ్చి చేరాయి. ఇప్పుడు మహేష్ 27వ సినిమాకు ఇదే ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే పరశురామ్ దర్శకత్వంలో మహేష్ 27వ సినిమా ఉంటుందని ప్రాధమికంగా తెలిసింది. మే 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర లాంచ్ ఉంటుంది. ఈ జూన్ నుండి షూటింగ్ ను మొదలుపెట్టి వచ్చే సమ్మర్ కు చిత్రాన్ని విడుదల చేయాలని అనుకుంటున్నారు.

- Advertisement -

నిజానికి మహేష్ దిల్ రాజుకు మరో సినిమా చేస్తానని మాట ఇచ్చాడు. తన సినిమాల విషయంలో దిల్ రాజు చేస్తున్న దానికి ఫిదా అయిపోయిన మహేష్, దిల్ రాజుకు సోలో నిర్మాతగా సినిమా అవకాశాన్ని ఇస్తానని చెప్పాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుందనుకున్నారు. అయితే ఇప్పుడు వంశీ పైడిపల్లి పక్కకు తప్పుకోవడంతో పరశురామ్ వచ్చి చేరాడు. దీంతో లెక్కలన్నీ మారిపోయాయి.

పరశురామ్ తో కమిట్మెంట్ ఉన్న 14 రీల్స్ ప్లస్ వచ్చింది. సుకుమార్ తో సినిమా వద్దనుకున్నప్పటి నుండి మహేష్ తో సినిమా బాకీ ఉండిపోయింది మైత్రి సంస్థకు. ఇక మహేష్ జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ ఎలానూ ఉండనే ఉంది. ఇలా మూడు నిర్మాణ సంస్థలు కలిసి మహేష్ 27 ను నిర్మించనున్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All