Homeటాప్ స్టోరీస్`ఆర్ ఆర్ ఆర్‌` క్లైమాక్స్ కోసం నిక్ పావెల్!

`ఆర్ ఆర్ ఆర్‌` క్లైమాక్స్ కోసం నిక్ పావెల్!

`ఆర్ ఆర్ ఆర్‌` క్లైమాక్స్ కోసం నిక్ పావెల్!
`ఆర్ ఆర్ ఆర్‌` క్లైమాక్స్ కోసం నిక్ పావెల్!

ద‌ర్శ‌క‌ధీరుడు జ‌క్క‌న్న అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న చిత్రం `ఆర్ఆర్ఆర్‌`. ఫ్రీడ‌మ్ ఫైట‌ర్స్ అల్లూరి సీతారామ‌రాజు, కొమ‌రం భీంల ఓ ద‌శ‌లో క‌లిస్తే ఏం జ‌రిగింది అనే ఫాంట‌సీ క‌థ నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.  యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా న‌టిస్తున్నారు. బాలీవుడ్ న‌టి అలియాభ‌ట్‌, హాలీవుడ్ న‌టి ఒలివియా మోరీస్ హీరోయిన్‌లుగా క‌నిపించ‌నున్న ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.

ఈ మూవీ క్లైమాక్స్ స‌న్ని వేశాల చిత్రీక‌ర‌ణ‌లో భాగంగా ప్ర‌ఖ్యాత హాలీవుడ్ ఫేమ‌స్ యాక్ష‌న్ డైరెక్ట‌ర్ నిక్ పావెల్ సెట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. `క్లైమాక్స్ గురించి ఎలాంటి అప్‌డేట్ రావ‌డం లేద‌ని ఆలోచిస్తున్న అభిమానుల కోసం ఒక అప్‌డేట్ ఇస్తున్నాం. క్లైమాక్స్ కోసం ప్ర‌ఖ్యాత హాలీవుడ్ ఫేమ‌స్ యాక్ష‌న్ డైరెక్ట‌ర్ నిక్ పావెల్ వ‌చ్చారు` అంటూ చిత్ర బృందం ట్విట్ట‌ర్‌లో ఓ వీడియోని పంచుకుంది. డీవీవీ దాన‌య్య డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

- Advertisement -

ఈ చిత్రంలో కొబ‌రం భీంగా ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామ‌రాజుగా రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్న విష‌యం  తెలిసిందే. ఇందులో రామ్‌చ‌ర‌ణ్‌కు జోడీగా అలియాభ‌ట్‌, ఎన్టీఆర్‌కు జోడీగా హాలీవుడ్ న‌టి ఒలివియా మోరీస్ న‌టిస్తున్నారు. కీల‌క పాత్ర‌ల్లో అజ‌య్ దేవ‌గ‌న్‌, స‌ముద్ర‌ఖ‌ని క‌నిపించ‌నున్నారు. అత్యంత భారీ హంగుల‌తో హాలీవుడ్ చిత్రాల‌కు ఏమాత్రం తీసిపోని స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 13న ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All