Homeటాప్ స్టోరీస్విక్ర‌మ్ సినిమాల‌కు గుడ్‌బై చెబుతున్నారా?

విక్ర‌మ్ సినిమాల‌కు గుడ్‌బై చెబుతున్నారా?

విక్ర‌మ్ సినిమాల‌కు గుడ్‌బై చెబుతున్నారా?
విక్ర‌మ్ సినిమాల‌కు గుడ్‌బై చెబుతున్నారా?

విల‌క్ష‌ణ చిత్రాల‌తో ఆక‌ట్టుకున్న హీరో చియాన్ విక్ర‌మ్‌. రిస్కీ పాత్ర‌ల్లో న‌టిస్తూ క‌మ‌ల్ త‌రువాత ఆ త‌ర‌హా పాత్ర‌ల్లో ప్ర‌యోగాలు చేసే న‌టుడిగా పేరు తెచ్చుకున్నారు విక్ర‌మ్‌. `అప‌రిచితుడు` చిత్రంతో త‌న‌లోని న‌ట విశ్వ‌రూపాన్ని చూపించిన విక్ర‌మ్ గ‌త కొంత కాలంగా త‌న స్థాయి విజ‌యాల్ని సొంతం చేసుకోలేక‌పోతున్నారు. ప్ర‌స్తుతం `కోబ్రా`, పొన్నియ‌న్ సెల్వ‌న్ చిత్రాల్లో న‌టిస్తున్న ఆయ‌న త్వ‌ర‌లో సినిమాల‌కు గుడ్ బై చెప్ప‌బోతున్నాడ‌ని ప్ర‌చారం మొద‌లైంది.

త‌న త‌న‌యుడు ధృవ్‌ని హీరోగా నిల‌బెట్టాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్న విక్ర‌మ్ ఇక‌పై అత‌ని కోస‌మే పూర్తి స్థాయి స‌మ‌యం కేటాయించ‌బోతున్నాడ‌ని, అందుకే ఆయ‌న సినిమాల‌కు గుడ్ బై చెప్పేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని తాజాగా టాక్ వినిపిస్తోంది. అయితే ఆ వార్త‌ల్లో ఎలాంటి వాస్త‌వం లేద‌ని, అవ‌న్నీ వ‌ట్టి పుకార్లేన‌ని విక్ర‌మ్ పీఆర్వో మీడియాకు ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

- Advertisement -

నిరాధార‌మైన వార్త‌ల్ని విని ఆశ్చ‌ర్యానికి గుర‌య్యామ‌ని, విక్రమ్ ప్ర‌స్తుతం `కోబ్రా`, పొన్నియ‌న్ సెల్వ‌న్ చిత్రాల్లో న‌టిస్తున్నార‌ని, ప్ర‌స్తుతం ప్రమాద‌క స్థితిలో వున్న ప్ర‌స్తుత స‌మ‌యంలో కొంత మంది మ‌తిస్థిమితం కోల్పోయి ఇలాంటి పుకార్ల‌ని పుట్టిస్తున్నార‌ని ఘాటుగా స్పందించారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All