Monday, October 3, 2022
HomeINTERVIEWSప్రతి నటుడు హిట్ కొట్టాలనే చేస్తాడు-విక్రమ్

ప్రతి నటుడు హిట్ కొట్టాలనే చేస్తాడు-విక్రమ్

Vikram Interview
Vikram

శివ‌పుత్రుడు, అప‌రిచితుడు చిత్రాల‌తో తెలుగు లో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న చియాన్ విక్ర‌మ్ క‌థానాయ‌కుడిగా అక్ష‌ర‌హ‌స‌న్‌, అభిహ‌స‌న్ కీల‌క పాత్ర‌ల్లో రాజేష్ ఎం.సెల్వ ద‌ర్శ‌క‌త్వంలో త‌మిళంలో రాజ్‌క‌మ‌ల్ ఫిల్మ్ ఇంట‌ర్‌నేష‌న‌ల్ నిర్మాణంలో ట్రైడెంట్ ఆర్ట్స్ కె.ర‌విచంద్ర‌న్ బ్యాన‌ర్ పై రూపోందిన చిత్రం `క‌డ‌ర‌మ్ కొండాన్‌` ఈ చిత్రాన్ని తెలుగు లో టి.న‌రేష్ కుమార్‌, టి. శ్రీధ‌ర్ లు సంయుక్తంగా టి.అంజ‌య్య స‌మ‌ర్ప‌ణలో పారిజాత మూవీ క్రియెష‌న్స్ బ్యాన‌ర్‌పై జూలై 19న విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా చియాన్ విక్ర‌మ్‌ ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చారు.. ఈ సందర్బంగా విక్రం మిస్టర్ కేకే చిత్రం గురించి పత్రికలవారితో ముచ్చటించారు. ఆ విశేషాలు మీకోసం..

- Advertisement -

యాక్షన్ రియల్ గా ఉంటుంది!
‍- ఇంట‌ర్నేష‌న‌ల్ స్టైల్లో తెర‌కెక్కిన సినిమా `మిస్ట‌ర్ కెకె`. నా సినిమా కెరీర్‌లో వ‌న్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్ట‌ర్‌ను ఈ సినిమాలో పోషించాను. అది పాజిటివా? నెగ‌టివా? అని ముందే పసిగ‌ట్ట‌డం ప్రేక్ష‌కుడికి వీలుకాదు. గ్రే షేడ్స్ ఉండే పాత్ర నాది. రేపు సినిమా చూసే స‌మ‌యంలో ఆ విష‌యం మీకే అర్థ‌మ‌వుతుంది. సినిమాకు క‌థే ముఖ్యం.

అన్ని స‌మ‌యాల్లో అది కుద‌ర‌క‌పోవ‌చ్చు. మంచి క‌థ గొప్ప రెక్ట‌ర్ ఉండ‌క‌పోచ్చు. కొన్ని సినిమాల‌కు క్యారెక్ట‌ర్ పేరే సినిమా టైటిల్‌గా ఉంటుంది. అంటే పాత్ర అంత బాగా ఉంటుంద‌నేగా. నేను ఇంగ్లీష్ త‌ర‌హా సినిమా చేసి చాలా కాల‌మైంది. స్టైల్‌, ఫేజ్ చాలా కొత్తగా ఉంటుంది. యాక్ష‌న్ రియ‌ల్‌గా ఉంటుంది. ఫ్రాన్స్ నుండి వ‌చ్చిన గిల్ రియ‌ల్‌గా ఉండేలా ఫైట్స్‌ను తెర‌కెక్కించారు. ఒక‌రోజులో జ‌రిగే క‌థ కాబ‌ట్టి.. సినిమా ఫాస్ట్ ఫేజ్‌లో ర‌న్ అవుతుంటుంది.

ఇంట‌ర్నేష‌న‌ల్ స్టైల్ మూవీని తెర‌కెక్కిస్తున్నానుకుంటే మ‌న ఆడియెన్స్‌కు క‌నెక్ట్ అవుతుందా? మ‌న నెటివిటీని మిస్ అయ్యామా? అనే భావ‌న క‌ల‌గ‌కుండా మ‌న ఎమోషన్స్ ఉండే సినిమాను తెర‌కెక్కించాం.

శివ‌పుత్రుడుని రీమేక్ చేయ‌క‌పోవ‌డానికి కార‌ణం అదే!
– నార్మ‌ల్‌గా డైలాగ్స్ వ‌ల్లే మ‌నం పెర్‌ఫార్మ‌న్స్ చేయ‌గ‌లుగుతాం. అలాంటి డైలాగ్స్ లేకుండా నేను న‌టించానంటే.. ఏదో ఒక పార్ట్ ఆడియెన్స్‌కు క‌నెక్ట్ చేస్తుంద‌నే న‌మ్ముతాను. ఉదాహ‌ర‌ణ‌కు నేను శివ‌పుత్రుడు సినిమా చేశాను. దాన్ని ఎవ‌రూ రీమేక్ చేయ‌లేదు. అంత‌కు ముందు ఎన్నో సినిమాలు తెలుగులో రీమేక్ అయ్యాయి. శివ‌పుత్రుడుని రీమేక్ చేయ‌క‌పోవ‌డానికి కార‌ణం.. ఆ సినిమా ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ కాదేమోన‌ని అనుకున్నారు. కానీ అది నా ప‌రంగా బాగా క‌నెక్ట్ అయ్యింది.

నేటివిటీ కార‌ణంగానే ఆడియెన్ సినిమాకు క‌నెక్ట్ కాడు. ఎమోష‌న్ మాత్ర‌మే క‌నెక్ట్ అవుతుంది. ఉదాహ‌ర‌ణ‌కు గేమ్ ఆఫ్ థ్రోన్ సినిమా నేటివిటీ మ‌న‌ది కాదు. కానీ ప్రేక్ష‌కులు సినిమాను చూశారు. అలాగే బాహుబ‌లి సినిమా అంద‌రికీ క‌నెక్ట్ అయ్యింది. అలా ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అయ్యే మంచి క‌థ‌, క్యారెక్ట‌ర్‌, ఫాస్ట్ ఫేజ్‌లో న‌డిచే సినిమా. ఇప్పుడు ప్యాన్ ఇండియా సినిమాలు రూపొందుతున్నాయి.

అలాగే నేను ఓ భాష‌లోనే సినిమాలు చేయాల‌నుకోలేదు. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో నాకు బ్రేక్ ఇచ్చిన సినిమాలున్నాయి. తెలుగులో నాకు న‌చ్చే స్క్రిప్ట్ వ‌స్తే సినిమా చేస్తాను.

ప్రేక్ష‌కుడికి క‌నెక్ట్ అయ్యే స‌బ్జెక్ట్‌నే ఎంచుకుంటాను!
ప్ర‌తి న‌టుడు డ‌బ్బుకోస‌మో, ఏదో చేద్దాం లే! అనేలా కాకుండా హిట్ కొట్టాల‌నే ఉద్దేశంతోనే సినిమాలు చేస్తాడు. నా విష‌యానికి వ‌స్తే నాకు హిట్ వ‌చ్చిన `సేతు` సినిమాకు ముందు 10-12 ఏళ్ల నుండి సినిమాలు చేస్తున్నాను. కానీ బ్రేక్ రాలేదు. కానీ ప్ర‌తి సినిమా చేసే స‌మ‌యంలో ఇది నాకు క‌చ్చితంగా బ్రేక్ ఇస్తుంద‌ని అనుకునే చేశాను.

న‌టుడిగా నేను ఏ సినిమా చేసినా ప్రేక్ష‌కుడికి క‌నెక్ట్ అయ్యే స‌బ్జెక్ట్‌నే ఎంచుకుంటాను. అందుకే ఇండియ‌న్ సినిమాలో నాకంటూ ఒక గుర్తింపు ఉంది. డైరెక్ట‌ర్ రాజేశ్ టెక్నిక‌ల్‌గా మంచి ప‌రిజ్ఞాన‌మున్న వ్య‌క్తి కావ‌డంతో త‌న‌కేం కావాలో పూర్తి అవ‌గాహ‌న ఉంది. కాబ‌ట్టి కంఫ‌ర్ట్ జోన్‌లో సినిమాను చేసేశాను.

ఆయ‌న మాట్లాడిన తీరు చూసి క‌ళ్లు చెమ‌ర్చాయి!
సాధార‌ణంగా క‌మ‌ల్‌సార్ ఎవ‌రి గురించి పెద్ద‌గా మాట్లాడ‌రు. కానీ ఈ సినిమా ఆడియో టైమ్‌లో నా గురించి, నేను న‌టించిన తీరు ఆయ‌న మాట్లాడిన తీరు చూసి క‌ళ్లు చెమ‌ర్చాయి. క‌మ‌ల్ సార్ ఓ ఈరా.. ఈ సినిమాలో నా క్యారెక్ట‌ర్‌ను క‌మ‌ల్‌సార్ చేయాల్సింది. కానీ.. రాజ‌కీయాల్లో ఉండ‌టం వ‌ల్ల చేయలేక‌పోయారు. నేను చేశాను. ఆయ‌న సినిమా చూసి గుడ్ జాబ్ అని చెబితే చాల‌ని అనుకుంటున్నాను. మ‌ణిర‌త్నంగారితో సినిమా చేయ‌డాన్ని బాగా ఇష్ట‌ప‌డ‌తాను. ఆయ‌న మేకింగ్ డిఫ‌రెంట్‌గా ఉంటుంది.

ప్ర‌తి స‌న్నివేశాన్ని ఆయ‌న వివ‌రించేట‌ప్పుడు ఎలా వివ‌రిస్తారా? అని ఆయ‌న ప‌క్క‌నే ఉండి అబ్జ‌ర్వ్ చేస్తుంటాను. ఆయ‌న డైరెక్ష‌న్‌లో పొన్నియ‌న్ సెల్వ‌న్ చేయ‌బోతున్నాం. ఈ సినిమాలో నా పాత్ర‌లో ఎమోషన్స్ ఎక్కువ‌గా ఉంటాయి. రాజు పాత్ర‌లో క‌న‌ప‌డ‌తాను. ఆ పాత్ర కోస‌మే జుట్టును కూడా పెంచుకుంటున్నాను. పొన్నియ‌న్ సెల్వ‌న్‌గా జ‌యం ర‌వి న‌టిస్తాడేమో ఇంకా తెలియ‌దు. ఆ పాత్ర క‌న‌ప‌డ‌దు కానీ.. అంద‌రూ ఆయ‌న గురించే మాట్లాడుకుంటూ ఉండేలా సినిమా ర‌న్ అవుతుంటుంది. అంద‌రి పాత్ర‌ల‌కు ప్రాముఖ్యత ఉంటాయి.

త‌ను చాలా నేచుర‌ల్‌గా న‌టించాడు!
ధృవ్ అమెరికాలో మెథ‌డ్ యాక్టింగ్ నేర్చుకుంటున్నాడు. ఈ పాత్ర‌కు త‌ను మ‌రి చిన్నోడు అవుతాడ‌ని తెలుసు. ఐదేళ్ల త‌ర్వాత త‌న‌ని యాక్ట‌ర్ చేయాల‌నుకున్నాను. కానీ నిర్మాత డ‌బ్‌స్మాష్ వీడియో ఏదో చూసి త‌న‌తో సినిమా చేయాలంటూ వ‌చ్చి క‌లిశాడు. నేను ధృవ్‌కి ఫోన్ చేసిన‌ప్పుడు ఇప్పుడు నేను చేయాలంటారా నాన్నా? అడిగాను. చెయ్‌రా అని అంటే అలాగే అన్నాడు. తెలుగు సినిమా చూస్తావా? అంటే నువ్వు చెప్పావ్ క‌దా నాన్నా సినిమా చేస్తాన‌ని అన్నాడు.

త‌ను చాలా నేచుర‌ల్‌గా న‌టించాడు. కొన్ని సీన్స్‌లో నాకంటే బాగా న‌టించాడు. రొమాంటిక్ సీన్స్‌లో డిఫ‌రెంట్‌గా న‌టించాడు. రొమాంటిక్ సీన్స్ చేసే స‌మ‌యంలోనూ, డ‌బ్బింగ్ చెప్పే సంద‌ర్భంలోనూ నాన్నా నువ్వు బ‌య‌ట‌కు వెళ్లు నాన్నా అన్నాడు. నేను లేను.. ఓ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ ఉన్నాడ‌నుకుని చెయ్య‌మ‌ని చెప్పాను.. అంటూ ముగించారు!!

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts