Homeటాప్ స్టోరీస్విజయ్ దేవరకొండ మీద కుట్ర జరిగిందా

విజయ్ దేవరకొండ మీద కుట్ర జరిగిందా

Hero vijay devarakonda sensational comments హీరో విజయ్ దేవరకొండ మీద కుట్ర జరిగిందా ? అంటే అవుననే సమాధానం చెబుతున్నాడు స్వయంగా హీరో విజయ్ దేవరకొండ . తనపై కుట్ర జరిగిందని ఇదంతా నన్ను కిందకు లాగడానికి , నా ఇమేజ్ ని డ్యామేజ్ చేయడానికి …… నా ఎదుగుదలని చూసి సహించలేని వాళ్ళు చేసిన కుట్ర అని ప్రకటించాడు విజయ్ దేవరకొండ . పెళ్లి చూపులు చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన ఈ హీరో కు ఆ సినిమా మంచి గుర్తింపు ఇచ్చింది దాని తర్వాత అర్జున్ రెడ్డి చిత్రంతో ఒక్కసారిగా అగ్ర హీరోలతో సమానంగా క్రేజ్ వచ్చి పడింది దాంతో కొంతమందికి అసూయ కూడా కల్గింది విజయ్ దేవరకొండ అంటే .

ఆ అసూయలో భాగంగా నాపై కుట్ర చేసారాని కానీ ఎవరెన్ని కుయుక్తులు పన్నినా నేను వెనక్కి తగ్గేది లేదని ” వాట్సాప్ రౌడీస్ ” అంటూ అభిమానుల నుద్దేశించి ఆవేశంగా మాట్లాడాడు ఈ హీరో . ఒకదశలో కన్నీళ్లు పెట్టుకున్న విజయ్ తిరిగి పట్టరాని ఆవేశంతో ప్రసంగించి ఎలాంటి వాళ్లకు కూడా భయపడేది లేదని సవాల్ విసిరాడు . స్వయంగా విజయ్ దేవరకొండ కుట్ర విషయాన్నీ బయట పెట్టడంతో సంచలనంగా మారింది . ఊహించని విధంగా విజయ్ దేవరకొండ కు ఇమేజ్ రావడంతో కుట్ర చేసింది నిజమే అని వినిపిస్తోంది . విజయ్ దేవరకొండ ఇమేజ్ తగ్గించాలని ప్రయత్నిస్తే తగ్గేది కాదు కదా ! అది ప్రేక్షకులు మాత్రమే డిసైడ్ చేయాలి .

- Advertisement -

English Title: hero vijay devarakonda sensational comments

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All