Homeటాప్ స్టోరీస్విజయ్ దేవరకొండతో మిగతా హీరోలకు ఇబ్బందే

విజయ్ దేవరకొండతో మిగతా హీరోలకు ఇబ్బందే

Threat from vijay devarakonda to other star heroesవిజయ్ దేవరకొండ ఇప్పుడు క్రేజ్ ఉన్న హీరో అని కొద్దిరోజుల్లోనే స్టార్ హీరో అవుతాడని ఆ దమ్ము అతడికి ఉందని అంటున్నాడు అగ్ర నిర్మాత అల్లు అరవింద్ . పెళ్లి చూపులు , అర్జున్ రెడ్డి చిత్రాలతో సంచలనం సృష్టించిన హీరో విజయ్ దేవరకొండ కు ఆ చిత్రాల తర్వాత అనూహ్యమైన క్రేజ్ వచ్చింది . దాంతో అతడితో సినిమాలు చేయడానికి పలువురు దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారు . తాజాగా ఈ హీరో అల్లు అరవింద్ బ్యానర్ అయిన గీతా ఆర్ట్స్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే . పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ” గీత గోవిందం ” ఆగస్టు 15న విడుదలకు సిద్దమైన నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని వైజాగ్ లో నిర్వహించారు .

కాగా ఆవేడుకలో అల్లు అరవింద్ మాట్లాడుతూ విజయ్ దేవరకొండ పై ప్రశంసల వర్షం కురిపించాడు . రాబోయే కొద్దిరోజుల్లోనే విజయ్ దేవరకొండ స్టార్ హీరో అయిపోతాడని స్టేట్ మెంట్ ఇచ్చేసాడు . ఇప్పటికే విజయ్ దేవరకొండ కు అనూహ్యమైన క్రేజ్ వచ్చేసింది , సాలిడ్ హిట్స్ రెండు మూడు పడితే అగ్ర హీరోలైన మహేష్ , ఎన్టీఆర్ , ప్రభాస్ , చరణ్ ల సరసన చేరడం ఖాయమేమో ! రేసులో ఉన్న ఇతర హీరోలను వెనక్కి నెట్టి ముందు వరసలో దూసుకుపోయినా ఆశ్చర్యం లేదు, అంతటి ఫాలోయింగ్ ఏర్పడింది ఈ హీరోకు .ఒకదశలో స్టార్ హీరోలకు సైతం వణుకు పుట్టేలా క్రేజ్ వస్తోంది విజయ్ దేవరకొండకు . అయితే అందుకు తగ్గ హిట్స్ పడాలి మరి . గీత గోవిందం ఏమౌతుందో మరో రెండు రోజుల్లో తేలిపోనుంది .

- Advertisement -

English Title: threat from vijay devarakonda to other star heroes

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All