Homeటాప్ స్టోరీస్బిగ్‌బాస్‌లో పాల్గొనే ఆలోచ‌న త‌న‌కు లేదంట‌!

బిగ్‌బాస్‌లో పాల్గొనే ఆలోచ‌న త‌న‌కు లేదంట‌!

బిగ్‌బాస్‌లో పాల్గొనే ఆలోచ‌న త‌న‌కు లేదంట‌!
బిగ్‌బాస్‌లో పాల్గొనే ఆలోచ‌న త‌న‌కు లేదంట‌!

క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న వేళ ప్రైవేట్ ఆసుప‌త్రులు జ‌ల‌గ‌ల్లా సామాన్య జ‌నాన్ని పీక్కుతింటున్నాయి. దీనిపై స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది.  దేశంలో, రాష్ట్రాల్లో క‌రోనాపై యుద్ధం జ‌రుగుతుంటే మ‌రో ప‌క్క బిగ్‌బాస్ పై కూడా చ‌ర్చ మొద‌లైంది. నిత్యం మ‌ర‌ణాలు, క‌రోనా వైర‌స్ సోకిన వారి లెక్క‌ల‌తో విసిగిపోయిన జ‌నం ప్ర‌స్తుతం రిలీఫ్ కోసం వినోదాన్ని కోరుకుంటున్నారు. ‌దీంతో బిగ్ బాస్ సీజ‌న్ 4 వార్త‌ల్లో నిలుస్తోంది.

సీజ‌న్ 3 భారీ క్రేజ్‌ని సొంతం చేసుకోవ‌డంతో మేక‌ర్స్ సీజ‌న్ 3ని మించి సీజ‌న్ 4ని ర‌క్తిక‌ట్టించాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా కొంత కొత్త వారిని లైన్‌లోకి తీసుకొస్తున్నారు. వారికి ఇందులోకి రావ‌డానికి ఆస‌క్తి లేక‌పోయినా గాసిప్‌ల ద్వారా వారిని ఈ సీజ‌న్‌లోకి తీసుకొచ్చేలా ప్లాన్‌లు చేస్తున్నారు. అయితే ఆ ప్లాన్ బెడిసికొట్టింది. హీరో త‌రుణ్ సినిమాలు మానేసి చాలా కాల‌మౌతోంది. అత‌న్ని బిగ్ బాస్ సీజ‌న్ 4లోకి తీసుకురావాల‌ని ప్ర‌య‌త్నాలు చేశారు.

- Advertisement -

గ‌త కొన్ని రోజులుగా అత‌ని ఎంట్రీపై పుకార్లు షికారు చేస్తున్నాయి. దీనిపై త‌రుణ్ ఘాటుగా స్పందించారు. `గ‌త కొద్ది రోజులుగా సోష‌ల్ మీడియాలో, కొన్ని దిన ప‌త్రిక‌ల్లో  నేను బిగ్‌బాస్‌లో పాల్గొంటాన‌ని వ‌స్తున్న వార్త‌లు అవాస్త‌వం. బిగ్‌బాస్‌లో పాల్గొనే ఆలోచ‌న కానీ, ఉద్దేశ్యం కానీ నాకు ఏమాత్రం లేదు. ఎప్ప‌టికీ క‌ల‌గ‌దు అని ఫైన‌ల్‌గా అంద‌రికి స్ప‌ష్టం చేస్తున్నాను. ఇవి కేవ‌లం వ‌దంతులు మాత్ర‌మే. ద‌య‌చేసి త‌ప్పుడు వార్త‌ల‌ని ప్ర‌చారం చేయొద్దు` అని త‌రుణ్ స్ప‌ష్టం చేశారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All