Homeటాప్ స్టోరీస్విజయ్ దేవరకొండని సవాల్ చేస్తున్న హేబ్బా పటేల్

విజయ్ దేవరకొండని సవాల్ చేస్తున్న హేబ్బా పటేల్

హాట్ భామ హేబ్బా పటేల్ విజయ్ దేవరకొండని సవాల్ చేస్తోంది . హేబ్బా పటేల్ విజయ్ ని చాలెంజ్ చేయడం ఏంటి అని అనుకుంటున్నారా ? ఈ భామ తాజాగా ” 24 కిస్సెస్ ” అనే చిత్రంలో నటించింది . మిణుగురులు వంటి చిత్రానికి దర్శకత్వం వహించిన అయోధ్య కుమార్ ఈ బోల్డ్ చిత్రానికి దర్శకత్వం వహించాడు . 24 కిస్సెస్ బోల్డ్ కథాంశంతో తెరకెక్కడం వల్ల ఆ సినిమాకు క్రేజ్ వచ్చింది. కాగా ఈ చిత్రాన్ని నవంబర్ 15 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఇక ఆ మరుసటి రోజున విజయ్ దేవరకొండ నటించిన టాక్సీ వాలా విడుదల కానుంది . అంటే విజయ్ దేవరకొండతో హేబ్బా పటేల్ పోటీ అన్నమాట .

టాక్సీ వాలా చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉండే కానీ గ్రాఫిక్స్ వర్క్ ఆలస్యం కావడం , సినిమా అనుకున్న స్థాయిలో రాకపోవడంతో అవన్నీ సరిచేసుకొని ఇన్నాళ్ళకు సెట్ చేసి విడుదల చేస్తున్నారు . హేబ్బా పటేల్ సినిమా బోల్డ్ కథాంశం కాగా విజయ్ దేవరకొండ సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశం దాంతో ఒక్కరోజు తేడాలో వస్తున్న ఈ సినిమాలు పోటీ పడి బాక్సాఫీస్ వద్ద ఎవరు విజేత గా నిలుస్తారో అన్న ఆత్రుత నెలకొంది . విజయ్ దేవరకొండ ఇటీవలే నోటా చిత్రంతో ఫ్లాప్ అందుకున్నాడు దాంతో టాక్సీ వాలా హిట్ పై ఆశలు పెంచుకున్నాడు . ఇక హేబ్బా పటేల్ కుమారి 21 f తో సంచలనం సృష్టించి కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టింది . మరి ఈ 24 కిస్సెస్ తో ఏం చేస్తుందో చూడాలి .

- Advertisement -

English Title:  Heebah Patel open challenge to hero Vijay Devarakonda

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All