HomeVideosఉత్కంఠ రేకెత్తించేలా 'హీట్' ట్రైలర్.. మే 5న విడుదల

ఉత్కంఠ రేకెత్తించేలా ‘హీట్’ ట్రైలర్.. మే 5న విడుదల

ఉత్కంఠ రేకెత్తించేలా 'హీట్' ట్రైలర్.. మే 5న విడుదల
ఉత్కంఠ రేకెత్తించేలా ‘హీట్’ ట్రైలర్.. మే 5న విడుదల

మర్డర్ మిస్టరీలు, సస్పెన్స్ థ్రిల్లర్ జానర్‌లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఓ సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్ వాటి కోసం ఎదురుచూస్తూనే ఉంటారు. అయితే ఇప్పుడు ఈ కోవలోకి చెందిన ‘హీట్‌’ అనే సినిమా రాబోతోంది. వర్దన్ గుర్రాల, స్నేహా ఖుషి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను ఎం.ఆర్.వర్మ సమర్పణలో ర్యాన్ స్టూడియోస్, కౌముది సినిమాస్ బ్యానర్ల మీద ఎం.ఆర్.వర్మ, సంజోష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ఎం.ఎన్.అర్జున్, శరత్ వర్మ దర్శకత్వం వహించారు.

సస్పెన్స్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కించిన ఈ మూవీకి సంబంధించిన టైటిల్‌ పోస్టర్‌, హీరో ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను ఇటీవలె విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. మే 5న విడుదల కాబోతోన్న ఈ మూవీ నుంచి తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ ఆసాంతం ఉత్కంఠను రేకెత్తించేలా ఉంది.

- Advertisement -

‘ఫ్రెండ్ అంటే వెలుతురున్నప్పుడు షాడో లాంటి వాడు కాదు.. చీకట్లో కూడా వెలుతురునిచ్చే వాడే నిజమైన ఫ్రెండ్’ అంటూ సాగే డైలాగ్‌తో ట్రైలర్ ఓపెన్ అవుతుంది. చేజింగ్ సీన్లు, మర్డర్ సీన్లతో ట్రైలర్‌ ఉరుకులు పరుగులు పెట్టినట్టు అనిపిస్తోంది. ట్రైలర్ మధ్యలో వచ్చిన.. ‘మనకి అర్హత లేని వాటిని టచ్ చేయాలంటే గుండె ధైర్యం ఉండాలి’.. ‘ఆటలో ఆడాలంటే..ఆడటం మాత్రమే తెలిస్తే చాలదు.. ప్రత్యర్థిని సరిగ్గా అంచనా వేయగలిగిన వాడు.. ప్రెజర్‌ను సరిగ్గా హ్యాండిల్ చేయగలిగిన వాడు మాత్రమే గెలుస్తాడు’.. ‘మైండ్ ఈజ్ డేంజరస్ వెపన్’.. ‘ఎమోషన్ ఈజ్ ఏ మోస్ట్ డేంజరస్ వెపన్’.. అంటూ వచ్చిన డైలాగ్స్ అదిరిపోయాయి.

ఈ ట్రైలర్‌లో విజువల్స్, ఆర్ఆర్, సినిమాటోగ్రఫీ అన్నీ కూడా మెప్పించేలా ఉన్నాయి. ఈ సినిమాకు గౌతమ్ రవిరామ్ సంగీతాన్ని అందించగా.. రోహిత్ బాచు కెమెరామెన్‌గా పని చేశారు. శివన్ కుమార్ కందుల, శ్రీధర్ వెజండ్ల సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమాను మే 5న మేకర్లు భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.

నటీనటులు : వర్దన్ గుర్రాల, స్నేహా ఖుషి, మోహన్ సాయి, అంబికా వాణి, వంశీ రాజ్, పుల్కిత్, అప్పాజీ అంబరీష, జయ శ్రీ రాచకొండ, ప్రభావతి వర్మ తదితరులు

సాంకేతిక బృందం
నిర్మాతలు : ఎం.ఆర్.వర్మ, సంజోష్
సహ నిర్మాత : శివన్ కుమార్ కందుల, శ్రీధర్ వెజండ్ల
దర్శకత్వం : ఎం.ఎన్.అర్జున్, శరత్ వర్మ
కథ, స్క్రీన్ ప్లే : ఎం.ఆర్.వర్మ
సంగీతం : గౌతమ్ రవిరామ్
కెమెరామెన్ : రోహిత్ బాచు
పీఆర్వో : సాయి సతీష్‌

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All