Homeటాప్ స్టోరీస్బిగ్ బాస్ 5: ప్రియా పెద్ద బ్లండర్ చేసిందా?

బిగ్ బాస్ 5: ప్రియా పెద్ద బ్లండర్ చేసిందా?

బిగ్ బాస్ 5: ప్రియా పెద్ద బ్లండర్ చేసిందా?
బిగ్ బాస్ 5: ప్రియా పెద్ద బ్లండర్ చేసిందా?

బిగ్ బాస్ సీజన్ 5 లో నామినేషన్స్ మరోసారి ఆసక్తికరంగా సాగాయి. మొదటి వీక్ నుండే నామినేషన్స్ అనేవి ఉత్కంఠభరితంగా, ఎమోషనల్ గా సాగుతున్నాయి. ఒకరి మీద మరొకరు ఫైర్ అవ్వడం అనేది సాధారణం అయిపోయింది. ఇక మూడో వారం ఎలిమినేషన్ ముందు రెండు వారాల కన్నా పీక్స్ గా సాగుతోంది.

ముఖ్యంగా ప్రియా, లహరి మధ్య సాగిన వాదన చూడటానికి, వినడానికి కూడా ఇబ్బందిగా అనిపించింది. ముఖ్యంగా ప్రియా, లహరిని ఉద్దేశించి పదే పదే నువ్వు మగాళ్లతోనే ఎక్కువ సమయం గడుపుతున్నావు, రవితో నువ్వు బాత్ రూమ్ వద్ద హగ్ చేసుకున్నావు అని ఆరోపించడం హౌజ్ లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

- Advertisement -

లహరి, రవి ఇద్దరూ కూడా ప్రియా ఆరోపణలను ఖండించారు. హౌజ్ లోని మిగతా హౌజ్ మేట్స్ కూడా ప్రియా మాటలను తప్పుబట్టారు. బయట ప్రియాకు బాగానే ఫాలోయింగ్ ఉంది కానీ ఇప్పుడు ఆమె దాన్ని కోల్పోయిందేమో అనిపిస్తోంది. ప్రస్తుతానికైతే ప్రియా, లహరి, శ్రీరామ్, ప్రియాంక, మానస్ లు నామినేట్ అయ్యారు. ఈరోజు కూడా నామినేషన్ ప్రాసెస్ కొనసాగనుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All