Homeటాప్ స్టోరీస్హ్యాపీ వెడ్డింగ్ రివ్యూ

హ్యాపీ వెడ్డింగ్ రివ్యూ

Happy Wedding Movie Reviewహ్యాపీ వెడ్డింగ్ రివ్యూ :
నటీనటులు : నిహారిక , సుమంత్ అశ్విన్ , మురళీశర్మ
సంగీతం : శక్తికాంత్ కార్తీక్
నిర్మాతలు : ప్రమోద్ – వంశీ
దర్శకత్వం : లక్ష్మణ్ కార్య
రేటింగ్ : 2. 5 / 5
రిలీజ్ డేట్ : 28 జూలై 2018

మెగా డాటర్ నిహారిక , సుమంత్ అశ్విన్ జంటగా నటించిన చిత్రం ” హ్యాపీ వెడ్డింగ్ “. ఈరోజు ఈ చిత్రం విడుదల అయ్యింది . ప్రభాస్ సోదరుడు అలాగే మిత్రుడు ఇద్దరు కలిసి నిర్మించిన చిత్రం ఈ హ్యాపీ వెడ్డింగ్ . మరి ప్రేక్షకులను అలరించేలా ఈ చిత్రం రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే .

కథ :

- Advertisement -

ఆనంద్ ( సుమంత్ అశ్విన్ ) అక్షర ( నిహారిక ) లు ప్రేమించుకుంటారు . ఆ ప్రేమకు పెద్దల అనుమతి లభించడంతో వివాహతేదీ ని నిర్ణయిస్తారు . ఇక ఆనంద్ – అక్షర లు ఒక్కటి కావడమే తరువాయి అన్న సమయంలో అక్షర మాజీ లవర్ వరుణ్ ( రాజా ) వీళ్ళ జీవితంలోకి వస్తాడు . వరుణ్ రాకతో అక్షర కన్ఫ్యూజ్ కి గురౌతుంది పెళ్లి విషయంలో . తనకు ఆనంద్ సరిపోతాడా ? లేక వరుణ్ అని తీవ్ర తర్జన భర్జన పడుతున్న సమయంలో పెళ్లి తేదీ దగ్గరకు వస్తుంది . పెళ్లి విషయంలో తికమక పడుతున్న అక్షర చివరకు ఎవరిని చేసుకుంది ? ఏం జరిగింది ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :

నిహారిక
సుమంత్ అశ్విన్
స్టోరీ లైన్
మురళీశర్మ

డ్రా బ్యాక్స్ :

స్క్రీన్ ప్లే

నటీనటుల ప్రతిభ :

అక్షర పాత్రలో నిహారిక నటన ఈ సినిమాకే హైలెట్ గా నిలిచింది . అందంగా ఉంది అంతకుమించిన అందమైన నటనతో ఆకట్టుకుంది నిహారిక . సుమంత్ అశ్విన్ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో అలరించాడు . మురళీశర్మ కు మళ్లీ మరోసారి మంచి పాత్ర లభించింది అసలే ఉద్దండుడు కావడంతో తన ప్రతిభని మరింతగా జోడించాడు . ఇక మిగిలిన పాత్రల్లో ఆయా నటీనటులు తమతమ పాత్రల పరిధిమేరకు నటించారు .

సాంకేతిక వర్గం :

తమన్ అందించిన నేపథ్య సంగీతం బాగుంది , పాటలకు మాత్రం శక్తికాంత్ కార్తీక్ పాటలు కూడా బాగున్నాయి . విజువల్స్ బాగున్నాయి ,నిర్మాణ విలువలు ఇంకా బాగున్నాయి అయితే ఎడిటింగ్ పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది . ఇక దర్శకుడు లక్షణ్ విషయానికి వస్తే …… యువత ని అలరించే మంచి పాయింట్ ని ఎంచుకున్నాడు కానీ దాన్ని సరిగ్గా నెరేట్ చేయడంలో పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు . ఫస్టాఫ్ ని బాగానే రాసుకున్నప్పటికీ సెకండాఫ్ కు వచ్చేసరికి ల్యాగ్ ఎక్కువయ్యింది దాన్ని సరిచేసుకోక పోవడంతో ఇది అందరినీ అలరించే సినిమా కాకుండా పోయింది .

ఓవరాల్ గా :

అమ్మాయిలకు మాత్రమే !

English Title: happy wedding movie review

                                 Click here for English Review

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All