Homeటాప్ స్టోరీస్నిహారిక ఈసారైనా హిట్ కొడుతుందా

నిహారిక ఈసారైనా హిట్ కొడుతుందా

is niharika dream come true మెగా డాటర్ నిహారిక హీరోయిన్ గా పరిచయం అయ్యింది కానీ మొదటి సినిమా రిజల్ట్ తో షాక్ కి గురయ్యింది . ఒక మనసు చిత్రం డిజాస్టర్ కావడంతో ఆ షాక్ నుండి తేరుకోవడానికి చాలా సమయమే పట్టింది ఈ భామకు . మొత్తానికి ఎలాగోలా తేరుకొని మళ్ళీ కెరీర్ పై దృష్టి పెట్టింది సక్సెస్ కోసం . అందులో భాగంగా వెబ్ సిరీస్ చేసింది ఇక ఇప్పుడేమో ” హ్యాపీ వెడ్డింగ్ ” అంటూ సుమంత్ అశ్విన్ తో రొమాన్స్ చేస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తోంది నిహారిక .

ఈనెల 28న హ్యాపీ వెడ్డింగ్ చిత్రం విడుదల కానుంది . సుమంత్ అశ్విన్ కూడా హీరోగా సక్సెస్ కోసం ఆరాటపడుతున్నాడు అలాగే నిహారిక కూడా . ఈ రెండో సినిమా తోనైనా నిహారిక హిట్ కొడుతుందా ? తన కల నెరవేర్చుకుంటుందా ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది . మెగా కుటుంబం నుండి హీరోలు వస్తుండగా నేను సైతం అంటూ హీరోయిన్ గా వచ్చి డేర్ చేసింది నిహారిక . ఇక ఆమె పట్టుదల ముందు కుటుంబ సభ్యుల అభ్యంతరాలు పక్కకు పోక తప్పలేదు అయితే ఇంత పట్టుబట్టి సినిమాల్లోకి వచ్చిన నిహారిక విజయం సాధిస్తేనే మెగా కుటుంబానికి సంతోషం కానీ నిహారిక ఈ సినిమాతో హిట్ కొడుతుందా ? అంటే ఈ సినిమాపై అస్సలు అంతగా ఊహాగానాలు లేవు , అంచనాలు లేవు . మరి ఇలాంటి సమయంలో వస్తున్న హ్యాపీ వెడ్డింగ్ హిట్ అవుతుందా ? ప్రేక్షకులు ఆదరిస్తారా ? నిహారికకు విజయాన్ని కట్టబెడతారా ? చూడాలి .

- Advertisement -

English Title: is niharika dream come true

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All