Homeటాప్ స్టోరీస్నాని మంచి ఛాన్స్ మిస్స‌య్యారా?

నాని మంచి ఛాన్స్ మిస్స‌య్యారా?

నాని మంచి ఛాన్స్ మిస్స‌య్యారా?
నాని మంచి ఛాన్స్ మిస్స‌య్యారా?

నేచుర‌ల్ స్టార్ నాని మంచి ఛాన్స్ మిస్స‌య్యారా? అంటే టాలీవుడ్ వ‌ర్గాలు అవున‌నే చెబుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. మ‌ల‌యాళ యంగ్ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్ ఓకే బంగారం, `మ‌హాన‌టి` వంటి చిత్రాల‌తో తెలుగులో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాల త‌రువాత దుల్క‌ర్ తెలుగులో మ‌రో చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. హ‌ను రాఘ‌వ‌పూడి ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు.

వైజ‌యంతీ మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో స్వ‌ప్న సినిమా బ్యాన‌ర్‌పై ప్రియాంక ద‌త్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది. ఇటీ‌వ‌లే హీరో దుల్క‌ర్ స‌ల్మాన్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్‌ని మేక‌ర్స్ రిలీజ్ చేశారు. 1964 నేప‌థ్యంలో సాగే ఓ ప్రేమ‌క‌థ ఆధారంగా లెఫ్ట‌నెంట్ రామ్ అనే వ్య‌క్తి బ‌యోపిక్‌గా ఈ చిత్రాన్ని తెర‌పైకి తీసుకురాబోతున్నారు. టైటిల్ ఇంకా ఖ‌రారు కానీ ఈ చిత్రానికి `యుద్ధంతో రాసిన ప్రేమ‌క‌థ‌` అనే ట్యాగ్ లైన్‌ని కూడా ఫిక్స్ చేశారు.

- Advertisement -

అయితే ఈ చిత్రం ముందు హీరో నాని వ‌ద్ద‌కే వ‌చ్చిందంట‌. కొన్ని కార‌ణాల వ‌ల్ల ఈ సినిమా న‌టించ‌డానికి నాని ఆస‌క్తిని చూపించ‌లేద‌ని, ఆ త‌రువాతే ఈ సినిమా దుల్క‌ర్ స‌ల్మాన్ వ‌ద్ద‌కు వ‌చ్చింద‌ని, పిరియాడిక్ కాన్సెప్ట్‌తో రూపొంద‌నున్న ఈ చిత్రాన్ని నాని మిస్స‌య్యాడ‌ని ఈ మూవీ కాన్సెప్ట్ గురించి తెలిసిన వాళ్లంతా అంటున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All