Homeటాప్ స్టోరీస్బ్యాడ్మింట‌న్ స్టార్ పెళ్లి వార్త చెప్పేసింది!

బ్యాడ్మింట‌న్ స్టార్ పెళ్లి వార్త చెప్పేసింది!

Gutta jwala and Vishnu Vishal finally open up his relationship
Gutta jwala and Vishnu Vishal finally open up his relationship

హైద‌రాబాదీ బ్యాడ్మింట‌న్ స్టార్ గుత్తా జ్వాల‌, త‌మిళ హీరో విష్ణు విశాల్ గ‌త కొంత కాలంగా ప్రేమ‌లో వున్నార‌ని, డేటింగ్ చేస్తున్నార‌ని వ‌రుస క‌థ‌నాలు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఆన్‌లైన్‌లో సోష‌ల్ మీడియా వేదిక‌గా వీరిద్ద‌రు క్లోజ్‌గా వున్న ఫొటోలు ఈ చ‌ర్చ‌కు మ‌రింత ఆజ్యం పోశాయి. అయినా వీరిలో ఎవ‌రూ మీడియా ముందుకు రాలేదు.

సోష‌ల్ మీడియా వేదిక‌గా వివ‌ర‌ణ ఇవ్వ‌డానికి సుముఖ‌త‌ని చూపించ‌లేదు. అయితే తాజాగా త‌మ ప్రేమ బంధంపై బ్యాడ్మింట‌న్ స్టార్ గుత్తా జ్వాలా క్లారిటీ ఇచ్చారు. అవును, మేమిద్ద‌రం డేటింగ్‌లో వున్నాం. ఇందులో దాచుకోవ‌డానికి అంటూ ఏమీ లేదు. త్వ‌ర‌లోనూ మా పెళ్లి జ‌ర‌గ‌బోతోంది. వివాహ తేదీ ఖ‌రారైన త‌రువాత లేదా ముహూర్తాలు పెట్టుకుని పెళ్లి ఏర్పాట్లు మొద‌ల‌య్యాక ఆ విష‌యాన్ని మేమే తెలియ‌జేస్తాం` అని వెల్ల‌డించారు.

- Advertisement -

క‌రోనా వైర‌స్ కార‌ణంగా సామాజిక దూరాన్ని పాటిస్తున్నామ‌ని, అత‌న్ని మిస్స‌వుతున్నాన‌ని గుత్తా జ్వాల వెల్ల‌డించింది. 2011లో విష్ణు విశాల్ కాస్ట్యూమ్ డిజైన‌ర్ ర‌జ‌నీ న‌ట‌రాజ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్లు డేటింగ్ అనంత‌రం వీరిద్ద‌రు వివాహం చేసుకున్నారు. కానీ మ‌ధ్య‌లో ఏమైంతో తెలియ‌దు. 2018లో విడాకులు తీసుకున్నారు. ఆ త‌రువాత నుంచే విష్ణు విశాల్ బ్యాడ్మింట‌న్ స్టార్ గుత్తా జ్వాల‌తో డేటింగ్ చేస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All