Homeటాప్ స్టోరీస్గుత్తాజ్వాల - ఆ హీరో మధ్య ఏం జ‌రుగుతోంది?

గుత్తాజ్వాల – ఆ హీరో మధ్య ఏం జ‌రుగుతోంది?

గుత్తాజ్వాల - ఆ హీరో మధ్య ఏం జ‌రుగుతోంది?
గుత్తాజ్వాల – ఆ హీరో మధ్య ఏం జ‌రుగుతోంది?

హైద‌రాబాద్ బ్యాడ్మంట‌న్‌కి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపుని తీసుకొచ్చిన క్రేజీ స్టార్ గుత్తా జ్వాల‌. బ్యాడ్మింట‌న్‌లో స్టార్ గా రాణించిన త‌న‌దైన ముద్ద‌ర వేసిన ఆమె గ‌త కొంత కాలంగా వివాదాల్లోనూ ముందు వ‌రుస‌లో వుంటోంది. నితిన్ చిత్రం `ఇష్క్‌` టైమ్‌లో ఓ ప‌బ్ సాంగ్‌లో త‌ళుక్కున మెరిసిన గుత్తా జ్వాల ఆ త‌రువాత నితిన్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసి వార్త‌ల్లో నిలిచింది. కేవ‌లం నితిన్ కోస‌మే ఆ పాట‌లో క‌నిపించాన‌ని, అంత‌కు మించి త‌న‌కు ఏ మాత్రం తెలియ‌ద‌ని చెప్పి వార్త‌ల్లో నిలిచింది.

ఆ త‌రువాత కూడా బ్యాడ్మింట‌న్‌పై కూడా విమ‌ర్శ‌లు చేసి హాట్ టాపిక్‌గా మారింది. గ‌త కొంత కాలంగా త‌మిళ హీరో విష్ణు విశాల్‌తో అత్యంత స‌న్నిహితంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. విశాల్ త‌న‌కు మంచి మిత్రుడ‌ని చెబుతోంది. అయితే విష్ణు విశాల్ మాత్రం త‌న భార్య‌కు విడాకులిచ్చి కొత్త జోడీ కోసం ఎదురుచూస్తున్నాడు. త‌ర‌చూ గుత్తా జ్వాలాని క‌లుస్తూ ప్ర‌త్యేకంగా ఆమె కోస‌మే హైద‌రాబాద్ విజిట్ చేస్తున్నాడు.

- Advertisement -

దీంతో ఈ ఇద్ద‌రు డేటింగ్‌లో వున్నారంటూ వ‌రుస క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల గుత్తా బ‌ర్త్‌డే పార్టీకి విష్ణు విశాల్ హాజ‌రు కావ‌డం, ఇద్ద‌రు క‌లిసి ప్రేమికుల్లా ఫొటోల‌కు పోజులివ్వ‌డంతో వీరిపై పుకార్లు తారా స్థాయికి చేరాయి. తాజాగా ఈ పుకార్ల‌కు ఫుల్ స్టాప్ పెట్టే ప్ర‌య‌త్నం చేసింది గుత్తా జ్వాల‌. గ‌త కొంత కాలంగా విష్ణు విశాల్ తో డేటింగ్‌లో వున్నాన‌ని, త్వ‌ర‌లోనే ఇద్ద‌రం వివాహం చేసుకోబోతున్నామ‌ని వెల్ల‌డించింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All